లెమన్ వాటర్ అధికంగా తాగితే సైడ్ ఎఫెక్ట్స్….

నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేసవి కాలంలో వేడి నుండి ఉపశమనం పొందడానికి నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. బరువును కూడా నియంత్రించటంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను తొలగించటంలో సహాయపడుతుంది. అయితే అధికంగా నిమ్మకాయ నీరు తాగితే దుష్ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా? బరువు తగ్గడానికి లెమన్ వాటర్ మోతాదుకు మించి విచక్షణారహితంగా తాగుతున్నవారు దాని దుష్ప్రభావాలు గురించి తెలుసుకోవాల్సిందే.

*నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.

*నిమ్మ రసం తరుచూ తాగుతుంటే అధిక మొత్తంలో విటమిన్ సీ రక్తంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది. ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

*నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో పాటుగా తగినంత మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో స్ఫటికాల రూపంలో పేరుకుపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

*నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఎసిడిటీ ఎముకలు బలహీనపడతాయి.

*నిమ్మకాయలో అధిక మొత్తంలో యాసిడ్ ఉండటంతో దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది.