అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో ప్రారంభం!

భాగ్యనగరానికే తలమానికమైన హైదరాబాద్‌ మెట్రో రైలు కారిడార్‌-1 (మియాపూర్‌-ఎల్‌బీనగర్‌) మార్గం సోమవారం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌.. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వెళ్లే మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గవర్నర్‌ సహా ప్రముఖులందరూ అమీర్‌పేట నుంచి మెట్రోలో ఎల్బీనగర్‌కు పయనమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ మార్గంలో ప్రయాణికులను అనుమతించనున్నారు. నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్‌-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు ఎట్టకేలకు ప్రారంభం కావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెట్రోరైలు కారిడార్‌-1లోని కొంత దూరం మియాపూర్‌ నుంచి అమీర్‌పేట, కారిడార్‌-2లోని నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు 30 కి.మీ. మార్గాన్ని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ గత ఏడాది నవంబరు 28న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచి ప్రయాణికులకు మెట్రోలో అనుమతించారు. ఈ సారి మాత్రం ప్రారంభోత్సవం రోజు సాయంత్రం నుంచే అనుమతిస్తున్నారు.

ఎల్బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో గల ఎంజీబీఎస్‌ స్టేషన్‌.. ఆసియాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్లలో ఒకటి. మియాపూర్‌-ఎల్బీనగర్‌, జేబీఎస్‌-ఫలక్‌నుమా మెట్రో మార్గాలకు ఇది ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌. ఒకటి, రెండు అంతస్తుల్లో ఎల్బీనగర్‌ మెట్రో ప్లాట్‌ఫాం, మూడు, నాలుగు అంతస్తుల్లో జేబీఎస్‌కు ప్లాట్‌పామ్‌లు ఉంటాయి. 58 స్తంభాలు, 6 గ్రిడ్స్‌తో అత్యంత ఎత్తుగా ఈ స్టేషన్‌ నిర్మించారు. 140 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో స్టేషన్‌ ఉంటుంది. ఎంజీబీఎస్‌ స్టేషన్‌ వైపు ‘ఎ’ మార్గం, చాదర్‌ఘాట్‌ వైపు ‘బి’ మార్గం కోసం పొడవైన ఆకాశ మార్గాలను నిర్మించారు.

ఒకే మెట్రోలో వెళ్లొచ్చు

మియాపూర్‌ వాసులు ఎల్‌బీనగర్‌ వరకు వెళ్లాలంటే అమీర్‌పేట స్టేషన్‌లో మెట్రో మారాల్సిన పనిలేదు. ఒకే మెట్రోలో వెళ్లొచ్చు. బస్సులో గంటన్నర పట్టే ఈ దూరాన్ని మెట్రోలో 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. 8 నిమిషాలకు ఒక మెట్రో నడపనున్నారు. రద్దీ వేళల్లో ఆరున్నర నిమిషాలకు ఒకటి నడుపుతారు.

apteka mujchine for man ukonkemerovo woditely driver.