చచ్చిపోయేలోపు టీటీడీ ఛైర్మన్ అవుతా..

తాను చచ్చిపోయేలోపు టీటీడీ ఛైర్మన్ అవుతానని హీరో శివాజీ విశ్వాసం వెలిబుచ్చారు. దేవుడు తనకు ఆ అవకాశం తప్పక కల్పిస్తాడని నమ్ముతున్నట్లు శివాజీ వెల్లడించారు. ఒక టివి ఛానెల్ తో చర్చ సందర్భంగా సినీ హీరో శివాజీ తన ఆకాంక్షను బైటపెట్టారు. టీటీడీ ఛైర్మన్ అవ్వాలనే కోరిక తన చిన్ననాటి కోరికని శివాజీ చెప్పారు. తిరుమల వెంకటేశ్వరస్వామికి తాను పరమ భక్తుడినని…అందుకే వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై నుంచే తన పోరాటం ప్రారంభించినట్లు హీరో శివాజీ చెప్పుకొచ్చారు.

అయితే టీటీడీ ఇప్పుడు నీట్ గా, ఆహ్లాదకరంగా తయారైందని హీరో శివాజీ అన్నారు. అయితే టీటీడీని కొందరు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని…కానీ టీటీడీని ఎవనూ ఏమీ చేయలేదన్నారు. ఆ స్వామివారికి ఏం కావాలో అవి చేయించుకుంటాడని హీరో శివాజీ తిరుమల శ్రీవారిపై అచంచల భక్తి విశ్వాసాలను చాటుకున్నారు.

అలాగే ప్రస్తుతం టిటిడిలో సమస్యల గురించి హీరో శివాజీ ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తిరుమలలో అభివృద్ది పనులు చేపట్టేందుకు ఫారెస్ట్ ఇబ్బందులు ఉన్నాయంటూ ఆ రోజుల్లో ఒక చర్చ జరిగిందని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం వాటిపై దృష్టి సారించి ఫారెస్ట్ అనుమతులు క్లియర్ చేసినట్లయితే డ్యామ్ వాటర్ పెంచే అవకాశం ఏర్పడుతుందని…అలా డ్యామ్ వాటర్‌ను పెంచితే భక్తులకు మంచి జరుగుతుందని శివాజీ చెప్పారు. ప్రస్తుతం టిటిడిఅయితే టిటిడిలో ప్రస్తుతం కూడా దళారీ వ్యవస్థ కొనసాగుతోందని, దానిని తగ్గించాల్సివుందని హీరో శివాజీ అభిప్రాయపడ్డారు. అలాగే వైకుంఠ దర్శనం రోజు రాజకీయ నాయకుడు ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత అతనికి కాని, అతని కుటుంబానికి మళ్లీ టికెట్ ఇవ్వకూడదుని…ఆ అవకాశం భక్తులకు కల్పించాలని హీరో శివాజీ సూచించారు.