వైకల్యాన్ని ఓడించి.. అనుకున్నది సాధించి..

శ్రమించాలంటే శరీరం సహకరించాలి. సాధించాలంటే తపన ఉండాలి. గమ్యం చేరాలంటే అడుగు ముందుకేయాలి. ఇవన్నీ సన్మతి చేయలేదు. కానీ అనుకున్నది సాధించింది. ఎలా?

సన్మతి అందరమ్మాయిల్లా కాదు. ప్రత్యేకం. వైకల్యం అని చెప్పలేం. ఎందుకంటే ఆమె ముందు వైకల్యం కూడా మోకరిల్లింది. అడుగు తీసి అడుగు కూడా ముందుకు వేయలేని ఆమె అడుగు గమ్యాన్ని ముద్దాడింది. పాఠశాలలో చదివేటప్పుడు ఫీజుల్లో రాయితీ కావాలంటే ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని చెప్పారు. ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది సన్మతి. అప్పుడు వాళ్లు జిల్లా కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించి ద్రువీకరణ పత్రాన్ని కూడా పొందలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి ఎన్నో ఒడిదుడుకులు వైకల్యం వల్ల ఏ పని చేయాలన్న కష్టం అయ్యేది. అప్పుడు అనుకున్నదో మాట. ఆ నిర్ణయమే సన్మతిని వార్తల్లో వ్యక్తిగా నిలిపింది. పదిమందిలో ప్రత్యేక మహిళగా నిలబెట్టింది. స్వశక్తి బతుకుతూ పదిమందికి చేయూతనివ్వాలనుకున్నది. తనలాంటి దివ్యాంగులకు అండగా నిలబడాలనుకున్నది. 2009లో డిప్లొమా పూర్తి చేసింది. చదువు పూర్తవగానే కర్ణాటకలోని బోరగావ్‌లో టీచర్‌గా ఉద్యోగంలో చేరింది. గణితం, ఇంగ్లీష్, కన్నడ వంటి భాషలను మూడో తరగతి పిల్లలకు భోదించేది. అటు చదువులు చెప్తూనే బెంగళూరుకు చెందిన సోలార్ సంస్థకు బిజినెస్ డెలవప్‌మెంట్ ఆఫీసర్‌గా కూడా పనిచేసింది. ఓ వైపు పనిచేస్తూనే కర్ణాటక యూనివర్సిటీలో సోషియాలజీలో మాస్టర్ పూర్తి చేసింది. ప్రస్తుతం బోర్‌గావ్‌వాడి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. ప్రతిరోజూ 300 మంది చిన్నారుల పాఠాలు చెప్తున్నది. తనలాంటి దివ్యాంగులకు ఉద్యోగాలు ఇప్పించడం కోసం ప్రయత్నిస్తున్నది.

(నమస్తే తెలంగాణ కర్టెసీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*