నాన్న చివరి కోరిక.. తీర్చేశా: ఎన్టీఆర్

ఇటీవల మరణించిన తన తండ్రి హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు.. 

‘నాన్న నందమూరి హరికృష్ణగారి మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపారు. మంచి కొడుకుగా, భర్తగా, తండ్రిగా, నాయకుడిగా మచ్చలేని జీవితం గడిపారు. అంత త్వరగా నాన్నను మరచిపోలేం. నాన్న చనిపోయి నెల గడుస్తున్నా ఆయన మరణం నుండి బయటకు రాలేక మా హృదయాలు పచ్చి పుండులాగే ఉన్నాయి.

అయితే నాన్న గారు పదే పదే ఓ మాట చెబుతూ ఉండే వారు. మరణానికి ఎవరూ అతీతులు కాదు. అందరం క్షణికంగానే బతుకుతున్నాం అనేవారు. బహుషా ఆయన చనిపోతారని ముందే తెలిసిందేమో… అందుకే చనిపోవడానికి ముందు నాన్న ఫోన్ చేసి ఆయనకు ఇష్టమైన ‘పలావ్ తినాలని ఉంది. వండి పంపించు నాన్నా’ అన్నారు. అదే ఆయన చివరి కోరిక. నేను షూటింగ్ పూర్తైన వెంటనే ఇంటికి వచ్చి స్వయంగా పలావు వండి నాన్నకు పంపించా. ప్రతిరోజు మా గురించి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆయన ఎక్కడకి వెళ్తున్నా.. అన్నయ్య కళ్యాణ్ రామ్‌కి నాకూ ఫోన్ చేసి చెప్పేవారు. కాని ఆ ప్రమాదం జరిగిన రోజు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు’ అంటూ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు ఎన్టీఆర్.

apteka mujchine for man ukonkemerovo woditely driver.