యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన భారీ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌తో భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. చాలా కాలం తరవాత ఎన్టీఆర్ రాయలసీమ నేపథ్యం ఉన్న ఫ్యాక్షన్ సినిమాలో నటించడంతో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. రెగ్యులర్ ఫ్యాక్షన్ సినిమాల్లా కాకుండా త్రివిక్రమ్ స్టైల్లో ‘అరవింద సమేత’ను తెరకెక్కించడంతో.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూశారు. మొత్తానికి వాళ్ల నిరీక్షణకు తెరపడింది.
వారం రోజులు ముందుగానే నందమూరి అభిమానులకు దసరా పండుగను తీసుకువస్తూ ‘అరవింద సమేత’ నేడు(అక్టోబర్ 11న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల కన్నా ఒకరోజు ముందుగానే అమెరికాలో ప్రీమియర్లు వేసేశారు. అక్కడ ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. చాలా వరకు పాజిటివ్ టాకే వినిపిస్తుంది. ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించారని.. త్రివిక్రమ్ మళ్లీ సత్తా చాటారని అంటున్నారు. ప్రతి నాయకుడుగా నటించిన జగపతిబాబు రంగస్థలం మూవీని మించిన పెర్ఫామెన్స్ ఇచ్చారంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తొలి 20 నిమిషాలు అస్సలు మిస్ కావద్దని సలహా ఇస్తున్నారు.
త్రివిక్రమ్ డైలాగ్‌లు, థమన్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఫైట్స్ సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. ఓ ట్విట్టర్ యూజర్ అయితే.. ‘కత్తికి అంటిని రక్తాన్ని తొడకు తుడుచుకునే షాట్ సూపర్. బహుషా బోయపాటి కూడా ఇంత బాగా తీయలేరేమో. త్రివిక్రమ్ అద్భుతంగా చూపించారు’ అని పేర్కొన్నారు.
That Katthi ki antina Raktam Thoda ku thuduchukune shot.
Even Boya might not have done that the way Trivikram showed it.
Peaks. #AravindhaSametha
— Avinash Tarak. #ASVR (@Tarak_Avinash) October 11, 2018
అభిమానులు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రచారం చేస్తుంటే.. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఎబోవ్ యావరేజ్ అని చెబుతున్నారు. ‘దమ్ముకు ఎక్కువ మిర్చికి తక్కువ. గురూజీ మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్సింగ్. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, థమన్ మ్యూజిక్, పూజాహెగ్డే సూపర్’ అంటూ మరొకరు పేర్కొన్నారు. మొత్తానికి ట్విట్టర్లో ఇలా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాటే ఇక ఈ సినిమాకు తిరుగులేదనే చెప్పాలి.