పుష్కర మరణాలు : చంద్రబాబుకు క్లీన్ చిట్!

ఈరోజు శాసన సభ ముందుకు గోదావరి పుష్కర తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక వచ్చింది. 2015 జులై 15న గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట పై పలుమార్లు బహిరంగ విచారణ నిర్వహించిన ఏక సభ్య కమిషన్.. సుదీర్ఘ విచారణ తర్వాత కమిషన్ నివేదిక సమర్పించింది. పుష్కర దుర్ఘటనకు ముఖ్యమంత్రి కారణం కాదని ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాతే తొక్కిసలాట జరిగింది కమిషన్ అభిప్రాయం పడింది. అధికారం లో లేని పార్టీలు, రాజకీయ శత్రుత్వం, ప్రతి అంశాన్ని విమర్శలకు వాడుకోవలనుకోవడం కమిషన్ గమనించింది అంటూ ప్రభుత్వం పేర్కొంది. ప్రమాదం జరిగిన ఘాట్ వెడల్పు 300మీటర్లు మాత్రమే ఉండటం… పుష్కర ముహూర్తం పై అనవసర ప్రచారం వల్లే జనం రద్దీ విపరీతంగా పెరిగి ఈ ఘటన జరిగింది అని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య అంశం ఒకటి ఉంది.. కమిషన్ చెప్పింది అక్షరాలా నిజం.. పుష్కర ముహూర్తం పై అనవసర ప్రచారం వల్లే జనం రద్దీ విపరీతంగా పెరిగి ఈ ఘటన జరిగింది .. అవును అనవసర ప్రచారం వల్లే ఈ ఘటన జరిగింది. అయితే ఇక్కడ ఆ ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేది కమిషన్ గుర్తించలేదా ?పుష్కరాల ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు సర్కార్ భారీ ఎత్తున ప్రచారం చేసి, 100 లకోట్లు రూపాయిలు ప్రజా ధనాన్ని ఉప్పగించించిన సంగతి అందరికి తెల్సిందే. తన యెల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చింది కూడా ప్రజలందరూ చూసారు.. ప్రభావితులయ్యారు అన్నది అక్షరసత్యం.ఈ లెక్క ప్రకారం చూసిన, పుష్కర మరణాలకు చంద్రబాబు నాయుడు సర్కార్ పరోక్ష పాత్ర ఉన్నట్టే కదా..! ఈ అంశం కమిషన్ గురించకపోవడం బాధాకరం.

apteka mujchine for man ukonkemerovo woditely driver.