Home / News / Andhra / ఆ దమ్ము ధైర్యం చంద్రబాబుకి మాత్రమే ఉంది!

ఆ దమ్ము ధైర్యం చంద్రబాబుకి మాత్రమే ఉంది!

రాబోయే ఎన్నికల్లో మోడీ గెలవరని డిప్యూటీ సిఎం కెయి కృష్ణమూర్తి జ్యోస్యం చెప్పారు. ఏపీ పై నాలుగేళ్లుగా అసూయ తో నిధులు ఇవ్వకుండ కుట్రలు చేసిన మోడీని ఎదుర్కునే సత్తా దమ్ము ధైర్యం టెక్నాలజీ ఉన్న వ్యక్తి చంద్రబాబు అన్నారు.2019 ఎన్నికల్లో ఏపీ లో టీడీపీ విజయం సాధిస్తున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ పాలక వర్గం చైర్మన్ దేశాయ్ మాధవరావు ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో అభినందన సభ ఏర్పాటు చేశారు. సభలో రైతులు, డిప్యూటీ సిఎం కెయి కృష్ణమూర్తి, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు , చైర్మన్ దేశాయ్ మాధవరావు, లను పూలమాల తో సన్మానించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి,టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి మాట్లాడుతూ జగన్, పవన్ లు బీజేపీ పార్టీ తొత్తులుగా మారిపోయి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ప్రజలకు అబద్దాలు చెపుతు పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.