కోమటిరెడ్డి, సంపత్ ల సబ్యత్వం రద్దు!

కోమటిరెడ్డి, సంపత్ ల సబ్యత్వం రద్దు!

తెలంగాణ శాసనషభ లో కాంగ్రెస్ సభ్యులు దాదాపు అందరిని సమావేశాల నుంచి సస్పండ్ చేశారు. మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడం విశేషం. మిగిలిన పదకుండు మంది ఎమ్మెల్యేల పై ఈ సెషన్ వరకు సస్పెన్షన్ వేటు వేశారు. ప్రతిపక్షనేత జానారెడ్డి,పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, డి.కె. అరుణ, చిన్నారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులను సస్పెండ్ చేశారు. మంత్రి హరీష్ రావు ఒక తీర్మానం ప్రవేశ పెట్టగా, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మరో తీర్మానాన్ని ప్రతిపాదించారు. కాగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ అరాచక శక్తులను సహించే ప్రసక్తి లేదని అన్నారు. గవర్నర్, రాష్ట్రపతి లను గౌరవించుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. శసనమండలిలో షభ్బీర్ అలీ, పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులను కూడా సస్పెండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*