అర్థాంగి లేకపోతే అర్ధాయుష్షే..

పెళ్లికి, ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి అవినాభావ సంబంధం ఉందని వైద్యులు చెబుతున్నారు. జీవితంలో పెళ్లి చేసుకోనివారు 60 ఏళ్లకు మించి బతకడం లేదని ఓ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మధ్య వయసులో అర్థాంగి లేకపోతే అర్ధాయుష్షులు కాకతప్పడం లేదని వైద్యులు అంటున్నారు.

సాధారణంగా 40 యేళ్ళ నుంచి 60 ఏళ్ల లోపు వారిలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. వారిలో ధైర్యం సన్నగిలే సమయం అదే. అలాంటి సమయంలో జీవిత భాగస్వామి పక్కనుంటే, ఆ ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి కొరత ఉండదని వైద్యులు అంటున్నారు.

అటువంటి సమయంలో ధైర్యంగా ఉండగలిగితే, ఆ తర్వాత ఆరోగ్యానికి ఢోకా ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. 40-60 ఏళ్ల మధ్య వివాహితులుగా ఉన్నవారు, వివాహం కానివారు అనే రెండు వర్గాలుగా విభజించి, వందలాది మంది పరిశోధన చేయగా ఈ విషయం వెల్లడైంది.

ముఖ్యంగా జీవితంలో అసలు పెళ్లే చేసుకోనివారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇలాంటివారిలో గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వారి పరిశీలనలో తేలింది.

apteka mujchine for man ukonkemerovo woditely driver.