గంటా వినూత్న నిరసన!

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ నాన్ పొలిటికల్ జేఏసీ వినూత్న నిరసన చేపట్టింది. రైల్వే డీఆరే ఎం కార్యాలయం ఎదుట భోగి మంటలు వేసి విభజన హామీల చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రతులను నిరసనకారులు తగులబెట్టారు. కేంద్రం మోసపూరిత వైఖరిని అవలంబిస్తోందంటూ ఆందోళనకారులు నినాదాలు చేపట్టారు. ఈ కార్య్రకమానికి హాజరైన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనైనా సరే రైల్వో జోన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసారు.