‘గరుడపక్షి’ని ఎందుకు ప్రశ్నించరు?

తిరుమల శ్రీ వారిని ఎమ్మెల్యేరోజా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లుచేశారు.

రంగనాయకులమండపంలో వేదఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేరోజా సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలకు, ప్రతిపక్షానికి రక్షణ కల్పించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందంటూ రోజా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు హత్యయత్నానికి పాల్పడినట్లు రోజా ఆరోపణలు గుప్పించారు. టీడీపీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి శివాజీని క్యాబినెట్ మీటింగులోకి ఎలా అనుమతించారని ఆమె ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడ శివాజీ చెప్పినట్లు జరుగుతుంటే ఆయనను ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ చేస్తున్న రాజకీయ కుట్రలా ఉందని…., షర్మిల, విజయమ్మ పై బాబు రాంజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.