రెడ్లతో తిట్టించి చంద్రబాబు పైశాచిక ఆనందం!

సీఎం చంద్రబాబుకు అధర్మం, అన్యాయం మాత్రమే తెలుసని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. జగన్ సొంత జిల్లా కడపలో ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రొద్దుటూరులో జగన్ ను లక్ష్యంగా చేసుకుని అధర్మపోరాట దీక్షను నిర్వహించారని మండిపడ్డారు. కడప జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతుంటే… చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు.

జెసి దివాకరరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి వంటి రెడ్డి నేతలతో తిట్టిస్తూ చంద్రబాబు నవ్వుతూ కూర్చుని పైశాచిక ఆనందం చెందారని శ్రీకాంతరెడ్డి అన్నారు. కడప జిల్లా ప్రజలు కరువుతో అల్లాడుతుంటే, ఆ విషయం మాత్రం చంద్రబాబు ప్రస్తావించలేదని ఆయన అన్నారు. ధర్మం, న్యాయం, చట్టం, నీతి ఈ నాల్గింటిని చంద్రబాబు తొక్కిపెట్టారని, ఆయనకు తెలిసిందల్లా అధర్మం, అన్యాయం, చట్టవిరుద్ధం, అవినీతి మాత్రమేనని అన్నారు. ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్న వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని ఆరోపించారు.