ప్లాస్టిక్‌ సమస్యకు పుట్టగొడుగు పరిష్కారం..

ఆస్పెర్‌ గిలియస్‌ టుబినిజెనిసిస్‌! భూమ్మీద ఉన్న అనేకానేక పుట్టగొడుగు జాతుల్లో ఇది ఒకటి. కాకపోతే ఇది ప్లాస్టిక్‌ను తిని హరాయించుకోగలదు. ఈ అద్భుత లక్షణాన్ని ఉపయోగించుకుంటే ప్లాస్టిక్‌ వ్యర్థాల భరతం పట్టవచ్చునని అంటున్నారు లండన్‌లోని రాయల్‌ బొటానికల్‌ గార్డెన్స్‌ శాస్త్రవేత్తలు. ‘స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ ఫంగీ – 2018’లో ప్రచురితమైన వివరాల ప్రకారం పుట్టగొడుగులు కొన్ని ప్లాస్టిక్‌ను తినడమే కాదు.. నేల, నీటి కాలుష్యాన్ని ఎంచక్కా తొలగించగలవని, ఇంకొన్ని కాలుష్యానికి ఆస్కారం లేని భవన నిర్మాణ సామాగ్రి కూడా అందిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఏడాది క్రితం పాకిస్థాన్‌లోని ఓ చెత్తకుప్పలో దీన్ని తొలిసారి గుర్తించారు. ప్లాస్టిక్‌ చెత్త నాశనమయ్యేందుకు సహజంగా కొన్ని ఏళ్ల సమయం పడితే.. ఈ పుట్టగొడుగు మాత్రం వారాల్లోనే నాశనమయ్యేలా చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లాస్టిక్‌ చెత్తపై నేరుగా పెరగడంతోపాటు ఆ క్రమంలో ప్లాస్టిక్‌ అణువుల మధ్య ఉన్న రసాయన బంధాలను దెబ్బతీయడం ద్వారా ఈ పుట్టగొడుగు ఎదుగుతుందని టామ్‌ ప్రెస్కాట్‌ అనే శాస్త్రవేత్త వివరిస్తున్నారు.ప్లూరోటస్‌ ఒస్ట్రాటస్, ట్రామెటిస్‌ వెర్సికలర్‌ జాతి పుట్టగొడుగులు నేల, నీటిలోని క్రిమిసంహారక మందుల అవశేషాలు, రంగులు, పేలుడు పదార్థాల అవశేషాలను సురక్షితంగా తొలగించవని ప్రెస్కాట్‌ అంటున్నారు.

apteka mujchine for man ukonkemerovo woditely driver.