‘కోడి కత్తి’ కేసు కొత్త మలుపు!

‘కోడి కత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారని.. ఎక్కడికి తీసుకెళ్లారో సమాచారం ఇవ్వాలని కోరతూ విజయవాడ సెషన్స్ కోర్టులో శ్రీనివాస్‌ తరఫు న్యాయవాదులు జయకర్, సలీం పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయవాది పర్యవేక్షణలోనే విచారణ జరపాలని కోర్టు ఆదేశించినా.. ఎన్‌ఐఏ అధికారులు ఉల్లంఘించాని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కనీసం తమకు కూడా సమాచారం ఇవ్వకుండా శ్రీనివాస్‌ను తీసుకెళ్లారని పేర్కొన్నారు.