ఇండస్ట్రీలో చిన్న సినిమాల సీక్వెల్స్ సందడి..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు, మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న సినిమాలు వంద కోట్ల మార్క్ ని అందుకొని అదుర్స్ అనిపిస్తున్నాయి. తెలుగు నుంచి మ్యాడ్, టిల్లు స్క్వేర్, హనుమాన్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ నెంబర్స్ తో వావ్ అనిపిస్తే.. మలయాళం నుంచి మంజులం బాయ్స్, ప్రేమలు వంటి సినిమాలు నిర్మాతలకు భారీ ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టాయి.

కాగా ఈ సినిమాలు కేవలం భారీ విజయాన్ని నమోదు చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడమే కాదు, ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి. దీంతో ఈ క్రేజ్ ని కాష్ చేసుకోవడం కోసం మేకర్స్ వాటికీ సీక్వెల్స్ ని తీసుకు వచ్చేస్తున్నారు. ఈక్రమంలోనే టిల్లు స్క్వేర్ వచ్చి టిల్లు క్యూబ్ ప్రకటించింది. ఇక ఇటీవల మ్యాడ్ మూవీకి కూడా సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అంటూ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేసారు. ఇక తాజాగా మలయాళ సూపర్ హిట్ ప్రేమలుకు కూడా సీక్వెల్ ని ప్రకటించేసారు. 2025లో ప్రేమలు 2 రాబోతుంది అంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసారు. ఇక హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ వస్తుంది. మరి ఈ సీక్వెల్స్.. ఫస్ట్ మూవీలా ఆడియన్స్ ని అలరించి ఆకట్టుకుంటాయా లేదా అనేది చూడాలి.