ఆఫీసులో అతిగా తింటున్నారా ?

ఉద్యోగం చేసే మహిళలు వర్కుప్లేసులో రకరకాల స్నాక్స్‌ తింటుంటారు. ఫలితంగా వారిలో కాలరీలు బాగా పెరుగుతాయి. వర్కుప్లేసులో మహిళలు తింటున్న స్నాక్స్‌ వల్ల సంవత్సరానికి లక్ష కాలరీలు పెరుగుతున్నారని కూడా ఒక సర్వేలో వెల్లడైంది! అందుకే వర్కింగ్‌ విమెన్‌ ఎలాంటి స్నాక్స్‌కు దూరంగా ఉండాలో తెలుసుకుందాం…

ఆఫీసులో పనిచేసేటప్పుడు మధ్య మధ్యలో చాలామంది ఆడవాళ్లు బిస్కట్లు తింటుంటారు. ఇవి ఒకటి రెండు అయితే ఫరవాలేదు కానీ దానికి మించి తింటే శరీరానికి మంచిది కాదు. ఎంతో రుచిగా ఉండే బిస్కట్లను వెజిటిబుల్‌ ఆయిల్‌, పంచదార, మైదాపిండితో తయారుచేస్తారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు శరీరంలో ఎక్కువ కాలరీలు వచ్చి చేరతాయి.

మిల్కు కాఫీకి కూడా దూరంగా ఉండాలి. ఇది ఒక కప్పు తాగినా శరీరంలో కాలరీలు బాగా పెరుగుతాయి. ఉదాహరణకు ఒక చిన్న కప్పుతో తాగిన మిల్కుకాఫీలో 80-100 కాలరీలు ఉంటాయి. రోజులో మనం తీసుకునే ఒక అదనపు మీల్‌తో ఇది సమానం! అందుకే ఆఫీసులో దీనికి దూరంగా ఉండాలి. లేకపోతే లావవుతారు.

కొందరు కేక్స్‌ బాగా తింటుంటారు. సింగిల్‌ కేక్‌లో 10-12 గ్రాముల ఫ్యాట్‌ ఉంటుంది. అంతేనా…300 నుంచి 400 కాలరీలు కూడా అందులో ఉంటాయి. వీటిని వారంలో ఓ నాలుగైదుసార్లు తింటే చాలు బరువు బాగా పెరుగుతారు. అందుకే వర్కుప్లేసులో ఎవరు కేక్‌ను ఆఫర్‌ చేసినా వద్దని చెప్పండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

apteka mujchine for man ukonkemerovo woditely driver.