సెల్‌ఫోన్లు, డబ్బుల వర్షం : వైరల్‌ వీడియో

సెల్‌ఫోన్లు, డబ్బుల వర్షం : వైరల్‌ వీడియో

పెండ్లికి వచ్చే అతిథులపై పూలు, పన్నీరు చల్లడం తెలిసిందే. వేడుకల్లో కళాకారులపై డబ్బులు వెదజల్లడమూ గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో కామనే. కానీ పెండ్లికి వచ్చిన అతిథులతోపాటు వేడుక జరిగిన ఊరు ఊరందరిపైనా డబ్బులు, మొబైల్‌ఫోన్లు వర్షంలా కురిసిందిక్కడ! తన మన పర బేధం లేకుండా అక్కడికొచ్చిన ప్రతిఒక్కరికీ మొబైల్‌ఫోనో, డాలర్‌ లేదా రియాల్‌ కరెన్సీ నోటో సొంతమైంది. పాకిస్తాన్‌లో జరిగిన ఓ పెండ్లి వేడుకలో చోటుచేసుకున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి.

వరుడు బా..గా.. రిచ్ఛ్‌ : ముల్తాన్‌లోని షుజాబాద్‌కు చెందిన మొహమ్మద్‌ అర్షద్‌కు.. పంజాబ్‌ ఫ్రావిన్స్లోని ఖన్పూర్‌కు చెందిన ఓ అమ్మాయితో పెళ్లైంది. వరుడు అర్హద్‌కు ఎనిమిది మంది అన్నయ్యలున్నారు. వారిలో కొందరు అమెరికాలోనూ, ఇంకొందరు సౌదీ అరేబియాలోనూ స్థిరపడి బాగా సంపాదించారు. ఆఖరు తమ్ముడి పెళ్లి అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతోనే సెల్‌ఫోన్లు, డాలర్‌, రియాల్‌ నోట్ల వర్షం కురిపించారు. ఇదీ సంగతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*