చింతమనేనిపై పవన్ మరోమారు శివాలు!

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను జనసేన అధినే పవన్ కల్యాణ్ మరోసారి టార్గెట్ చేశారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులను చింతమనేని ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని పవన్ దృష్టికి నేతలు తీసుకొచ్చారు. దీంతో, చింతమనేనిపై పవన్ ఫైర్ అయ్యారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతోందని ప్రశ్నించారు.

తాను ఆకు రౌడీలకు, గాలి రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని పవన్ అన్నారు. తాను ఒక్క సైగ చేస్తే కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 16 ఏళ్ల వయసులోనే రౌడీలను తన్ని తరిమేశానని చెప్పారు. చింతమనేనిలాంటి వ్యక్తులను వెనకేసుకొస్తున్న టీటీపీకి తాను అండగా ఎందుకుండాలని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం తాను ఎవరితోనైనా గొడవపెట్టుకుంటానని చెప్పారు.