కేటీఆర్ పై పొన్నం విమర్శల దాడి!

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్టంలో అధికారం లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని,పొన్నం ప్రభాకర్ అన్నారు, వేములవాడ పట్టణంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు..

ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చెన్నమనేని రమేష్ బాబు భారతదేశ పౌరసత్వం లేకున్నా టిఆర్ఎస్ శాసన సభ్యుడి టికెట్ ఇచ్చిన,కెసిఆర్ తెలివి లేనితనం అని అన్నారు.ఇచ్చిన హామీలను మరచి ప్రగతి భవన్ లో వైబోగాలు అనుభవిస్తున్నడని ,మండిపడ్డాడు. సోనియాగాంధీ అమ్మనా బొమ్మనా అన్న కేటీర్ మూర్కుడు,అని, తెలంగాణ ఇవ్వకుంటే అమెరికాలో నువ్వు ఎం చేసేవాడివో గుర్తుకు చేసుకో అని అన్నారు.. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్తుంది అని అన్నారు . ప్రజలు అందరూ గమనిస్తున్నారు అని రాబోయేది కాంగ్రెస్ రోజులు అన్నారు . కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్నారు . కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ తో పాటుగా పండించిన ధరకు మద్దతు ధర కల్పిస్తుంది అన్నారు .

apteka mujchine for man ukonkemerovo woditely driver.