‘టెంపర్‌’ రీమేక్‌లో ప్రియ ప్రకాశ్‌?

ఒక్క చూపుతో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయ్‌. ‘ఒరు అదార్‌ లవ్‌’ అనే మలయాళీ చిత్రంలో నటించిన ప్రియ ప్రకాశ్‌కు టాలీవుడ్‌ నుంచే కాదు బాలీవుడ్‌ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి.

రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సింబా’ చిత్రంలో కథానాయికగా ప్రియను ఎంపికచేసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్’ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. రోహిత్‌ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తు్న్నారు. తొలుత ఇందులో రణ్‌వీర్‌కి జోడీగా ఆలియా భట్‌, శ్రద్ధా కపూర్లు నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ప్రియ ప్రకాశ్‌ పేరు వినిపిస్తోంది. కరణ్‌ జోహార్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రియ నటించిన ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రం మార్చి 1న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాలోని పాటలు ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు వ్యక్తులు ప్రియ, దర్శకుడు ఒమర్‌ లులుపై కేసులు వేశారు. ఈ విషయంలో తనపై ఎలాంటి క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా ప్రియ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో సినిమాను జూన్‌కు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*