Mana Aksharam
  • Home
  • News
  • Politics
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రోజా
Andhra Breaking Homepage-Slider News Politics

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రోజా

ఆ మధ్య ‘స్టార్ మా’ ఛానల్ లో చిరంజీవి వ్యాఖ్యాతగా వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో రోజా పాల్గొన్నారు. చాలా ఆసక్తికరంగా జరిగిన ఆ షోలో 6 లక్షల పై చిలుకు మొత్తం గెలుచుకున్న రోజా ఆ డబ్బును ఏం చేస్తారు అని ప్రశ్నించిన చిరంజీవితో నగరిలో ఉన్న ఆసుపత్రి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను అని అప్పుడే ప్రకటించారు. దీనికి చిరంజీవితో పాటు ఆడియన్స్ కూడా తమ కరతాళధ్వనుల ద్వారా తమ హర్షం వ్యక్తం చేసారు. గేమ్ షో అమౌంట్ కాబట్టి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, నాలుగు లక్షల నలభై ఒక్క వేల రూపాయల దాకా చెక్ అమౌంట్ వచ్చింది.

ఆనాడు చెప్పిన ప్రకారం రోజా నగరి 100 పడకల ఆసుపత్రి వద్ద పేషెంట్లు – వారి సంబంధీకుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ కోసం స్థలం సేకరించి ఆ మేరకు అనుమతి తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నా అధికారులతో పోరాడి చివరికి సాధించారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ నిత్యం వందలాది పేషెంట్లు వచ్చే ఈ హాస్పిటల్ కి కొన్ని సౌకర్యాలు లేనందుకు బహుమతిగా వచ్చిన మొత్తాన్ని ఇలా వినియోగించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. స్థలం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి వాటిని అధిగమించి బస్సు షెల్టర్ కోసం పూజ చేయటం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసారు. అబద్దపు హామీలు ఇచ్చి మోసం చేసే కొందరు నాయకుల కన్నా తన వ్యక్తిగత సొమ్మును సైతం ఇలా ప్రజా ప్రయోజన కార్యక్రమం కోసం ఉపయోగించినందుకు నగరి ప్రజలు రోజాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

Related posts

రోజా ఆవేదనలో అర్ధం ఉంది!

admin

బండ్లగణేష్ అనే నేను..!

admin

సీఎం ఇంటి ముందే ధర్నా చేస్తా:పవన్

admin

Leave a Comment