నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయ ద్వారాలు.. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్

శబరిమల ఆలయ ద్వారాలు సోమవారం (నవంబరు 5) సాయంత్రం తెరచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో శబరిమల సహా 30 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. సోమవారం ‘చితిర అట్ట విశేషం’ సందర్భంగా అయ్యప్ప ఆలయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించనున్నారు. అయితే ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం.. ఇందుకు కేరళ ప్రభుత్వం సమ్మతం తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వివిధ హిందూ సంఘాలు, ఆలయ బోర్డు వ్యతిరేకిస్తున్నాయి. ఆలయంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ 10 – 50 సంవత్సరాలలోపు మహిళలు శబరిమలలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. మహిళా జర్నలిస్టులకు కూడా ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించమని స్పష్టం చేస్తున్నాయి.

హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శబరిమల, పంబ, నెలిక్కళ్‌, ఇలౌంగళ్‌ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ఇద్దరు ఐజీలు, 10 మంది ఎస్పీలు, 2,300 మంది పోలీసులు ఆ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుప్రీంతీర్పుకు పోలీసులు కట్టుబడి ఉంటారని, భద్రత కల్పించమని ఎవరైనా మహిళలు కోరితే వారికి తప్పనిసరిగా రక్షణ కల్పిస్తామని అన్నారు.

మరోవైపు పంబానది దగ్గర ‘సేవ్ శబరిమల’ పేరుతో విశ్వహింద్ పరిషత్ (వీహెచ్‌పీ) భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో భక్తులు, వీహెచ్‌పీ కార్యకర్తలు తరలివస్తున్నారు.

apteka mujchine for man ukonkemerovo woditely driver.