జగన్ చేస్తుంది తప్పా? రైటా?

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు గుర్రాలపై వైసీపీ ద్రుష్టి పెట్టింది. గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు జగన్. నాలుగేళ్లుగా స్థానిక నియోజకవర్గాల్లో శ్రమించిన నేతలను సైతం పక్కన పెట్టేస్తున్నారు జగన్. . కీలక నేతలకు సైతం ఇది పరిస్థితి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి బాగా కనిపిస్తుంది. దీంతో జిల్లాలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడి తో సహా మెజారిటీ సీట్లు గల్లంతవడంతో YCP నేతల్లో అయోమయం నెలకొంది.‌‌ కొత్తగా వచ్చిన నేతలు ఉత్సాహంగా దూసుకుపోతుంటే పాత నేతలు రగిలిపోతున్నారు.

జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 5గురు సిట్టింగులు, సత్తెనపల్లి మినహా మిగిలిన ఇంఛార్జులను వరుసగా మారుస్తున్నారు జగన్. వినుకొండలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నన్నపనేని సుధ స్థానంలో బొల్లా బ్రహ్మనాయుడుకి నియోజకవర్గం బాద్యతలు అప్పగించారు.ఇక గురజాలలో కూడా వైసీపీ కీలక నేతగా ఉన్న జంగా కృష్ణమూర్తి కూడా పక్కనబెట్టి యువనాయకుడు కాసు మహేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.ఇప్పటికే చిలకలూరిపేట ఇంఛార్జిగా ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ను పక్కన పెట్టి కొత్త నాయకురాలు రజనీకి పగ్గాలు అప్పగించారు.‌గుంటూరు నగర నడిబొడ్డునున్న పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లేళ్ల అప్పిరెడ్డికి షాకిచ్చారు జగన్. ఆయన్ను మార్చి IPS మాజీ అధికారి ఏసురత్నంను సమన్వయకర్తగా నియమించారు. వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న అప్పిరెడ్డిని తప్పించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక పెదకూరపాడు నియోజక వర్గంలోనూ కావటి మనోహర్ నాయుడిని తప్పించారు. రేపల్లె నుంచి 2014లో పోటీ చేసిన మోపిదేవి వెంకట రమణ పైనా అధినేత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. వేమూరు ఇంఛార్జిగా ఉన్న మేరుగు నాగార్జునకు ప్రత్యామ్నాయం కూడా చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇలా వరస మార్పులతో నేతలకు షాక్ ఇస్తున్నారు జగన్. ఇంతకాలం పార్టీనే నమ్ముకున్న తమకు జరిగిన అన్యాయంపై నేతలు నివురుగప్పిన నిప్పుల కూర్చున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ నిప్పే పార్టీకి కొరివిపెట్టేలా ఉంది అని విశ్లేషకులు వాదిస్తున్నారు.

apteka mujchine for man ukonkemerovo woditely driver.