అలుపెరుగని బాటసారి!!

ప్రజా నాయకులు సాధారణంగా పుట్టిన రోజు అంటే ఎవరైనా..కుటుంబంతో, స్నేహితులతో, బంధువులతో, అభిమానులతో, కార్యకర్తలతో పుట్టిన రోజు జరుపుకోవడం మామూలే. కానీ ప్రజలతో కలిసి, ప్రజల మధ్య పుట్టినరోజు జరగడం ఆ రోజుకే ఒక ప్రత్యేకత ఇచ్చినట్టు కదా. వైయస్ జగన్ కు మాత్రమే ఆ అదృష్టం దక్కింది. ప్రస్తుతం జగన్ 46వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. జగన్ 41వ రోజు పాదయాత్రలో 46వ పుట్టిన రోజు వేడుకను జగన్ జరుపుకున్నారు. జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనంతపురం జిల్లా పుట్టపర్తికి వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు తరలి వచ్చారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అనే ముద్ర నుంచి ప్రతిపక్ష నేత, జననేతనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిగా ఎదిగిన అతడి ప్రస్థానం చాలా గొప్పది. ఓదార్పు యాత్ర అతడి జీవితాన్ని కాదు, రాష్ట్ర కాలగతినే మలుపు తిప్పిన సందర్భం . అప్పటి అధిష్టానం వద్దంది. మాట తప్పని వైయస్ వారసత్వం అందుకు ఎదురు తిరిగింది.ప్రలోభాలకు లొంగకుండా పార్టీని, పదవిని వదలి బయటకు వచ్చారు వైయస్ జగన్. ఆయన ఆశయాలే లక్ష్యాలుగా, ఆయన లక్ష్యాలే మార్గదర్శకాలుగా భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. నవ్యాంధ్రలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కురువృద్ధ పార్టీని మట్టి కరిపించారు. అమలు చేయలేని అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం చేసే అక్రమాలను అడుగడుగునా ఎండగడుతున్నారు. ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్ష నాయకుడై పోరాడుతున్నారు.ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. యాత్రలో ఉన్న జగన్‌ను ప్రజలు కలిసి తమ సమస్యలను ప్రస్తావిస్తున్నారు.

జగన్ 1972 డిసెంబరు 21వ తేదీన జన్మించారు. అయితే ప్రతిసారీ కుటుంబ సభ్యుల మధ్య బర్త్ డే వేడుకలు జరుపుకునే జగన్ ఈ సారి పాదయాత్రలో ఉండటంతో జనం మధ్యనే ఆయన బర్త్ డే కేక్ కట్ చేశారు. జగన్ బస చేసిన చోటుకు వేలాది మంది కార్యకర్తలు చేరుకోవడంతో కొంత తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను అదుపు చేయాల్సి వచ్చింది. జగన్ కోసం ప్రత్యేకంగా పెద్ద కేక్ ను తెప్పించారు. వైసీపీ నేతలు తరలి వచ్చి జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా ప్రజల మధ్యనే చేసుకోవాలని తాను భావించినట్లు జగన్ తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వైసీపీ నేతలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*