కులశేఖర్.. జీవితం వెనుక ఎన్నో మలుపులు!

ఒక మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం.. కష్టాలూ సాధారణం..కానీ ఇది అసాధారణం..చిరకాలంలో ఉన్నత స్థితికి ఎదిగి అంతే తొందరగా లోయల్లో పడిపోయాడు పాటల రచయిత కులశేఖర్.. కాదు దిగజారిపోయాడు ..

2000 సంవత్సరం ఆరంభం నుంచి అప్పటి తరానికి పరిచయం ఈ గీతాల చక్రవర్తి..ఈనాడులో గోపాపట్నం.. సింహాచలం ప్రాంత విలేఖరి.. తర్వాత ఈటీవీలో సబ్ ఎడిటర్.. ఇవేమీ అతనికి సంతృప్తి ఇవ్వలేదు.. తనలోని కళ ఏపాటిదో అతనికి తెలుసు.. దర్శకుడు తేజ.. సంగీత్ దర్శకుడు ఆర్పీలతో జత కలిశాడు..

కులశేఖర్ కలం నుంచి ఎన్నో సూపర్ హిట్లు..గాజువాక పిల్లా నుంచి ఏమైంది ఈవేళ.. ఎదలో ఈ సందడేలా.. ఒకటా రెండా..దర్శకులు ఇతడితో పాట రాయించుకోవాలని ఉత్సాహపడ్డారు.. ఒక దశాబ్దం కూడా పూర్తి కాలేదు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఎక్కువ కాలమే ఉన్నాడు.. బతుకుతాడా.. లేడా అని సందేహం.. ప్రాణాలతో బయటకొచ్చాడు.. అప్పటికే అతని మానసిక స్థితిలో మార్పు.. అబద్దాలు.. అప్పులు.. వ్యసనాలు అతనిలో భాగం అయిపోయాయి..

ఒక సాధారణ పూజారి ఇంట పుట్టిన అతని భార్య ఎంతో కష్టపడింది.. ఆమె సోదరుడు కూడా..వాళ్ళ చేయి దాటిపోయాడు.. విశాఖపట్నం ఏవీన్ కాలేజీలో గౌరవప్రదమైన ఉద్యోగం చేసిన తండ్రి మానసిక దిగులుతో ప్రాణం విడిచాడు.. అన్నదమ్ములు కులశేఖర్ లో మార్పుకోసం విఫలయత్నం చేశారు..రాజమండ్రి లో గుడిలో శఠగోపం దొంగిలించి జైలులో ఉన్నాడని తెలియగానే మనసు చివుక్కుమంది.. ఇక గాడిలో పడలేదు.. మానసిక రోగి కాస్తా దొంగలా మారిపోయాడు..నమ్మబుద్ది కాలేదు..

సిరివెన్నెల సీతారామశాస్ట్రీ ప్రేరణగా సినిమా పాటల రంగంలో అడుగుపెట్టిన కులశేఖరును ఆయన స్ఫూర్తి మంత్రంలాంటి గీతాలు మార్చలేకపోయాయి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..అనే పాటను కులశేఖర్ తరచూ పాడుతూ వినిపించేవాడు.. ఈ పాట వింటే సిరివెన్నెల కంటే కులశేఖర్ గుర్తుకు వచ్చేవాడు..నిన్న హైద్రాబాదులో చోరీ కేసులో అరెస్టయ్యాడనే వార్త చూడగానే గుండెల్ని ఎవరో పిండేసినట్టయింది..

apteka mujchine for man ukonkemerovo woditely driver.