వరంగల్‌ నిట్‌లో తన్నుకున్న విద్యార్థులు!

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ  (నిట్‌)లో జరిగిన స్ప్రింగ్‌ స్ప్రీ-2018 ముగింపు వేడుకల్లో అర్థరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెండు విద్యార్థి గ్రూపులు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో త్రివంత్‌ అనే విద్యార్థి గాయపడటంతో అతడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడ్డ త్రివంత్‌ బీటెక్‌ సివిల్‌ తృతీయ సంవత్సరపు విద్యార్థి. మరోవైపు విద్యార్థుల గొడవ నేపథ్యంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో నిట్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*