Tag Archives: congress

పరువు తీయడానికే పద్మారావును కేసీఆర్ సికింద్రాబాద్ నుంచి నిలబెట్టారు: రేవంత్ రెడ్డి

పద్మారావు పరువు తీయడానికే అతడిని కేసీఆర్ సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పద్మారావు నామినేషన్ దాఖలుకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. దీనిని బట్టే ఆయనకు వాళ్లు మద్దతివ్వడం లేదని అర్థమవుతోందన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ టిక్కెట్‌ను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. బుధవారం సీఎం సికింద్రాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

Read More »

రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. బ్యాంకులకు CM రేవంత్ రెడ్డి హెచ్చరిక

ఇచ్చిన మాట ప్రచారం ఆగష్టు 15వ తేదీన రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రకటించారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయంగా లబ్ధి పొందేందుకు వంద మాటలు చెబుతారని అవన్నీ నమ్మొద్దని అన్నారు. తప్పకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. బ్యాంకులు రైతులను ఇబ్బంది పెట్టొద్దని.. రుణమాఫీ చేసే బాధ్యత ...

Read More »

నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో CM రేవంత్ రెడ్డి పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పార్టీ ముఖ్య నేతలతో కలిసి కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం బావాజీ జాతర వేడుకలకు హాజరవుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత ...

Read More »

ప్రపంచం తలకిందులైనా రుణమాఫీ చేసి తీరుతాం: CM

ప్రపంచం తలకిందులైనా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ‘అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా రుణమాఫీ ఆగదు. అది పూర్తి చేసి రైతుల రుణం తీర్చుకుంటాం’ అని తెలిపారు. ఏపీలో నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటే తప్పిదమన్నట్లుగా మోదీ ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు.

Read More »

ఇంకా తానే ముఖ్యమంత్రిని అని కేసీఆర్ అనుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

తెలంగాణకు ఇంకా తానే ముఖ్యమంత్రిని అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్ నుంచి నీలం మధు గెలవాలన్నారు. తనతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. అసలు ...

Read More »

షర్మిలకు ఈసీ నోటీసులు

APPCC చీఫ్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Read More »

ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ పూర్తి: సీఎం రేవంత్

ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని, వరికి రూ.500 బోనస్ ఇస్తామని CM రేవంత్ పునరుద్ఘాటించారు. మహబూబాబాద్ సభలో మాట్లాడుతూ ‘అయ్య పేరు, తాత పేరు చెప్పుకొని, ఎవరి కాల్లో పట్టుకొని మేము రాజకీయాల్లోకి రాలేదు. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నువ్వు కాదు, ఎవరొచ్చినా పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రజాపాలన అందిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.

Read More »

బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు ప్రకాశ్ గౌడ్ కలిశారు. తన అనుచరులతో కలిసి ఈరోజో, రేపో కాంగ్రెస్ లో చేరుతానని రేవంత్ కు ప్రకాశ్ గౌడ్ తెలిపారు. రేవంత్ సమక్షంలోనే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Read More »

నేటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఉదయం మహబూబ్నగర్లో వంశీచంద్ రెడ్డి నామినేషన్కు హాజరై సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్కు హాజరైన అనంతరం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈనెల 21న భువనగిరి, 22న ఆదిలాబాద్, 23న నాగర్కర్నూల్, 24న జహీరాబాద్, వరంగల్ లో పర్యటించనున్నారు.

Read More »

రేపటి నుంచి రేవంత్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదిగో!

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కేరళ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రేపు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడతారు. రేపు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ...

Read More »