Tag Archives: kcr

నేడు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీఆర్ఎస్ సంగారెడ్డి సుల్తాన్పూర్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనుంది. పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సభలో పాల్గొంటారు. ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు.

Read More »

KCRపై కడియం సంచలన వ్యాఖ్యలు

ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌పై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేసే కార్మికులుగా చూస్తున్నారే తప్పా.. అందరికీ పార్ట్ నర్స్ అనే ఫీలింగ్ పార్టీ ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. తమకు ఎన్నడూ పార్టీలో ఓనర్ షిప్ రాలేదన్నారు. ఓనర్ షిప్ లేని పార్టీలో మనసు పెట్టి పనిచేయడం కష్టమవుతుందన్నారు. కేసీఆర్ మీకు ఏం తెలుసు అన్నట్లుగా తమ అభిప్రాయాలను ...

Read More »

రేపు కేసీఆర్ సభ

లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం, BRS చీఫ్ కేసీఆర్ రేపు సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో బహిరంగ సభకు హాజరుకానున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి తరఫున ఆయన ఓట్లు అభ్యర్థించనున్నారు. ఈ సభకు సుమారు లక్ష మందిని సమీకరించేందుకు BRS ప్లాన్ చేస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావు సభ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. కాగా మెదక్ నుంచి BRS అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు.

Read More »

కరవుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కారణం కాదు: పొన్నం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పొలాలు సందర్శనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిచారు. ఈ సందర్భంగా ఆయన వీడియో విడుదల చేశారు. కరువుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కారణం కాదన్నారు. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమన్నారు. మీరు రాజకీయంగా నిజంగా బీజేపీతో లేనట్లయితే.. రైతుల ప్రయోజనాలను కాపాడే నట్లయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.. మీరు రండి కలిసి వెళదామన్నారు. తెలంగాణలో నీటి లభ్యత, భూగర్భ జలాలు అడిగినటువంటి అనేక సంఘటనలు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ...

Read More »

కేసీఆర్ కీలక ప్రకటనపై ఉత్కంఠ!

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక బస్సులో రానున్న ఆయన తొలుత తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో రైతులతో మాట్లాడుతారు. కాగా ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read More »

ఈ నెల 15న మెదక్ జిల్లాలో KCR బహిరంగ సభ

ఈ నెల 15న మెదక్ జిల్లాలో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకి మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. రైతు సమస్యలపై బహిరంగ సభ నిర్వహిస్తున్న BRS…ఈ సభకు లక్షల్లో జనాలు వచ్చేలా ప్లాన్‌ చేస్తోంది. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి రాజీనామా గులాబీ పార్టీకి పెద్ద తలనొప్పులు తీసుకువచ్చింది. ఇచ్చిన టికెట్ కాదని కాంగ్రెస్లో చేరారు కడియం శ్రీహరి కుటుంబ ...

Read More »

దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల పేర్లను 48 గంటల లోపల బయటపెడితే తాను బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ తుక్కుగూడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. మాజీ సీఎం ...

Read More »

కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు : సీఎం రేవంత్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ పరిస్థితి చూస్తే.. జాలేస్తోంది. ఆయన అధికారం పోయిన బాధలో ఉన్నారు. పదేళ్ల తరువాత కేసీఆర్ కి రైతులు గుర్తుకొచ్చారు. మా వల్లనే కరువు వచ్చిందని అంటున్నారు. వర్షాలు కురవకపోవడంతో కరువు వచ్చింది. మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. మా వల్ల కరువు ఎలా వస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ అధికారం కోల్పోయిన దు:ఖంలో ఉన్నాడు. రైతుల మీద కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు. మేడిగడ్డ ...

Read More »

KCR, బండి సంజయ్‌లపై పొన్నం ప్రభాకర్ ఫైర్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ సీఎం కేసీఆర్‌లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ..ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోని బండి సంజయ్‌కి, నాలుగు నెలల పాటు ఉలుకు పలుకు లేకుండా ఇప్పుడు పొలాల బాట పట్టిన కేసిఆర్ ఈరోజు రైతుల దగ్గర ముసలి కన్నీరు కారుస్తూ డ్రామాలకు తెరలేపారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసిఆర్, బండి సంజయ్ ఇద్దరూ కూడా ఇక్కడ దీక్ష ...

Read More »

రేపు 3 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన, రైతులతో సమావేశం

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అంతకుమునుపు, మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పొలాల పరిస్థితిని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో ...

Read More »