Tag Archives: latest news

నేడు 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్

నేడు 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని సంజీవపురం బస చేసిన ప్రాంతం నుంచి 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం అయింది. బత్తలపల్లి, రామాపురం ,కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ ఎస్ పి కొట్టల,మలకవేముల మీదుగా పట్నం వరకు కొనసాగనుంది సీఎం జగన్‌ రోడ్ షో. పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుళ్ల వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు సీఎం ...

Read More »

పంజాగుట్ట పీఎస్ సిబ్బందిని బదిలీ చేసిన సీపీ

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్నీ బదిలీ చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐల నుంచి హోంగార్డుల దాకా మొత్తం 85 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ సిటీ ఆర్మ్ డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. వారి స్థానంలో ప్రస్తుతం 82 మందిని నియమించారు. పంజాగుట్ట పీఎస్ లో సిబ్బంది మొత్తాన్ని ఒకేరోజు బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వంలోని పెద్దలకు ఈ ...

Read More »

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం

భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 3,20,418 మందికి కోవిడ్‌ టెస్టులను నిర్వహించగా కొత్తగా 5,439 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా, రికవరీ రేటు 98.66 శాతంగా, క్రియాశీల రేటు 0.15 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 88.55 కోట్ల కోవిడ్‌ టెస్టులను నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఇప్పటి వరకు 212.17 ...

Read More »

2023 డిసెంబర్‌ నాటికి ప్రతి గ్రామంలో జియో 5జీ సేవలు

డిసెంబర్‌ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామ గ్రామాన జియో 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని రిలయన్స్‌ ఇండిస్టీ అధినేత ముఖేష్‌ అంబానీ తెలిపారు. సోమవారం జరిగిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముఖేష్‌ మాట్లాడుతూ.. జియో 5జీ సేవల్ని విస్త్రతంగా అంబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దివాళీకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తతో పాటు దేశంలో అన్నీ ప్రధాన నగరాల్లో జియో 5జీ నెట్‌ వర్క్‌లను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. దేశ మంతా హైక్వాలిటీ, హై ...

Read More »

49వ సిజెఐగా యుయు లలిత్‌ ప్రమాణం

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్ ఉమేష్‌ లలిత్‌( యుయు లలిత్‌) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవనలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, నవంబర్‌ 8 వరకు మాత్రమే అనగా కేవలం 74 రోజుల మాత్రమే సిజెఐగా ఉంటారు. ఆ సమయానికి ఆయనకు 65 ఏళ్లు నిండనున్నాయి. ఆ తర్వాత సీనియార్టీ జాబితాలో ఉన్న జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ...

Read More »

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు

 ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు అందడంతో పోలీసులు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్‌ 12న రాజా సింగ్‌పై నమోదైన కేసుల్లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గురువారం ఉదయం షాహినాయత్‌ గంజ్‌, మంగళ్‌హట్‌ పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ ఇంటికి వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో రాజాసింగ్‌ ఇంటి వద్ద ...

Read More »

అమిత్‌ షాతో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ భేటీ

తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణలేని బిజెపి అక్కడ పాగా వేసేందుకు సినీ ప్రముఖులకు గాలం వేస్తోంది. అందులో భాగంగా తెలుగు సినీ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ అవకాశమిచ్చింది. తాజాగా అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని అమిత్‌ షా సమావేశం కావడం తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ రాజకీయాల్లో కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాత్రి 10.20 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కి వచ్చిన అమిత్‌ షా… జూ.ఎన్‌టిఆర్‌ కోసం అరగంట సేపు వేచి చూశారు. జూ.ఎన్‌టిఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ...

Read More »

బీజేపీని ఓడించే సత్తా టిఆర్‌ఎస్‌కే ఉంది: సీపీఐ చాడ

బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే మా మద్దతని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియా ఎదుట ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. ”బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే మా మద్దతు. ఉపఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదు. బీజేపీని ఓడించే సత్తా ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉంది. అందుకే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇది మునుగోడుకే పరిమితం కాదు. భవిష్యత్‌లో కూడా టీఆర్‌ఎస్‌తో పని చేస్తాం. 2018 ...

Read More »

మునుగోడులో రేవంత్‌ రెడ్డి కొత్త వ్యూహం

 మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వివిధ రాజకీయ పార్టీలనేతలు పావులు కదుపుతున్నారు. సీఎం కేసీఆర్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బహిరంగ సభలు ఉండటంతో అధికార తెరాస, బిజెపి ముఖ్య నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మకాం వేశారు. మండలాల వారీగా జనసమీకరణపై స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.పిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపధ్యంలో మునుగోడులో శనివారం పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఒకే రోజు ఐదు మండలాల్లో పాదయాత్రకు ...

Read More »

మంత్రివర్గ విస్తరణతో నితీష్‌కు కొత్త చిక్కులు..

మంత్రివర్గవిస్తరణతో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే బీమా భారతి నుండి వ్యతిరేకత ఎదురైంది. జెడి(యు) ఎమ్మెల్యే లేషి సింగ్‌కు కొత్త కేబినెట్‌లో మంత్రి పదవి దక్కగా, తనకు మాత్రం మొండిచెయ్యి చూపారంటూ బీమా భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.  లేషి సింగ్‌ మంత్రిగా కొనసాగితే తాను రాజీనామా చేస్తానని ఆమె  హెచ్చరించారు. లేషి సింగ్  ప్రతిసారీ తన నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తుందని, అలాంటి వ్యక్తిని కేబినెట్ లోకి తీసుకోవడం  వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. లేషిసింగ్ పట్ల ...

Read More »