Tag Archives: mopidevi

ఎంపి మోపిదేవి వెంకటరమణకు తప్పిన ప్రమాదం

రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రయాణిస్తున్న వాహనం, ఆయన కాన్వాయ్ లోని వేరొక వాహనాన్ని ఢకొీట్టింది. కశింకోట మండలం తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వేర్వేరు వాహనాల్లో తన కాన్వాయ్ తో వెళ్తున్నారు. తాళ్లపాలెం జంక్షన్లో మోపిదేవి వెంకటరమణ ప్రయాణస్తున్న వాహనం కాన్వయ్ లోని ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొంది. దీంతో, మోపిదేవి ...

Read More »

నేడు ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు

నేడు ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు

ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల్లో పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో సభ్యుడు పరిమళ్‌ నత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నారని, మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు

Read More »

మండలికి పిల్లి సుభాష్‌, మోపిదేవి రాజీనామా

మండలికి పిల్లి సుభాష్‌, మోపిదేవి రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించి పెద్దల సభకు ఎన్నికైనందున వీరిద్దరు మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు మండలి చైర్మన్‌కు బుధవారం తన రాజీనామా లేఖను పంపించగా ఆయన ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికల్లో వీరిద్దరితో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్‌ నత్వాని ఎన్నికైన విషయం తెలిసిందే.

Read More »