Tag Archives: rahul gandhi

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు సమన్లు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కోర్టు ముందు హాజరుకావాలంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 28న కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశాలిచ్చారు. బీజేపీ పరువు తీసేలా పేపర్లలో ప్రకటనలు ఇచ్చారంటూ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ ఎస్.శివప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై 40 శాతం కమిషన్ ఆరోపణలు ...

Read More »

రాహుల్ గాంధీ బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు: విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ స్థాయిలో నాయకులు వెళ్లిపోతున్నారని, ఇదే వరుసలో రాహుల్ గాంధీ కూడా రేపో మాపో బీజేపీలో చేరినా తానేమీ ఆశ్చర్యపోనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తన పునాదులు కోల్పోయిందని, ఇప్పుడు ఆ పార్టీకి అగ్రనేతలు కూడా దూరమవుతున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. ఏపీకి ద్రోహం చేసినప్పుడే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని, ఇప్పుడు దేశం అంతా కాంగ్రెస్ కు ఇదే పరిస్థితి ఎదురవుతోందని పేర్కొన్నారు.

Read More »

అసోంలో రాహుల్ గాంధీపై కేసు సీఐడీకి బదిలీ

అసోంలోని గువహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు పోలీసుల అనుమతించనప్పటికీ బారికేడ్లు తొలగించుకుని నగరం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైంది. తాజాగా అసోం పోలీసులు ఈ కేసు సీఐడీకి బదిలీ చేశారు. దర్యాప్తు కోసం సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

Read More »