Tag Archives: ram gopal varma

అంత సీన్ లేదు.. షర్మిలపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. షర్మిల పాత్ర ‘వ్యూహం’ సినిమాలో ఉంటుంది కానీ ఏం చేయరన్నారు. రియల్ లైఫ్ లో కూడా సీఎం జగన్ కు షర్మిల ఏం చేయలేదా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ బదులిస్తూ.. జగన్ జైలులో ఉన్నప్పుడు.. ఆయనకు బయటకు రావడానికి యాక్సెస్ లేనప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చారన్నారు. ప్రజలు షర్మిలలో జగన్‌ను చూసుకోవడానికే మీటింగ్‌లకు ...

Read More »

తెలంగాణ థియేటర్లలో “వ్యూహం” మాయం

నేడు విడుదల కానున్న రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను హైదరాబాద్ తో సహా తెలంగాణలో అన్ని థియేటర్లు అకస్మాత్తుగా తొలగిస్తున్నాయి. మల్టీప్లెక్సులు, థియేటర్లు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న సినీ అభిమానులకు డబ్బులు రీఫండ్ చేస్తున్నాయి. ఏపీ రాజకీయాల నేపథ్యంలో తీసిన ఈ సినిమాతో టీడీపీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశ్యంతోనే సినిమాను తొలగిస్తున్నట్లు సినీ, రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే సినిమా రద్దు చేయడం వెనక ఎవరున్నారనేది తెలియాల్సి ఉంది.

Read More »

వ్యూహం సినిమాకు లైన్ క్లియర్..!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమాకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు సూచనలతో మూవీకి రెండోసారి సెన్సార్ నిర్వహించి ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఇక మూవీ సీక్వెల్ ‘శపథం’ను ఈ నెల 23న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రాజకీయ నేతల్ని కించపరిచేలా సినిమా తీశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Read More »

23న ‘కొండా’ విడుదల

రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించిన కొండా మురళీ, సురేఖ జీవిత నేపథ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో అదిత్‌ అరుణ్‌, ఐరా మోర్‌, పథ్వీరాజ్‌ నటించారు. ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26నల విడుదల చేశారు. తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేస్తూ ‘కొండా’ విడుదల తేదీని ప్రకటించారు.

Read More »

రామ్‌గోపాల్‌వర్మకు షాక్ ఇచ్చిన సెన్సార్‌బోర్డు

రామ్‌గోపాల్‌వర్మకు సెన్సార్‌బోర్డు షాక్‌ ఇచ్చింది. ఆయన తీసిన ‘దిశ’ చిత్రం సెన్సార్‌ను బోర్డు రిజెక్ట్‌ చేసింది. ఈ చిత్రంలో రియల్‌ ఎన్‌కౌంటర్‌ సీన్లను పోలిన విధంగా సినిమాలోనూ తీశారు. దీంతో ఈ సినిమాకు సెన్సార్‌ ఇవ్వాలా? లేదా? అని బోర్డు సందిగ్ధంలో పడిపోయింది. దీంతో సినిమాను రివిజన్‌ కమిటీ పరిశీలనకు పంపారు. ఇప్పటికే ఈ చిత్రంపై దిశ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెన్సార్‌ బోర్డు కూడా ఈ చిత్రం సెన్సార్‌ను రిజెక్ట్‌ చేసింది. దీంతో సినిమా విడుదలపై పలు ...

Read More »

వర్మ మరో సినిమా ‘పవర్‌ స్టార్‌’

వివాదాస్పద చిత్రాలు తీయటానికి అలవాటు పడ్డ రాం గోపాల్‌ వర్మ … ఆ వరుసలో తరువాత సినిమాగా ‘పవర్‌స్టార్‌’ టైటిల్‌ ప్రకటించాడు. ఆమేరకు ఆదివారం ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలోని తారాగణం పికె, ఎంఎస్‌, ఎన్‌బి, టిఎస్‌, ఒక రష్యన్‌ భామ, నలుగురు పిల్లలు, ఎనిమిది గేదెలు అని పేర్కొన్నాడు. తరువాత పవన్‌ కల్యాణ్‌ రూపురేఖలతో ఉన్న ఈ చిత్రం హీరో ఫొటో కూడా విడుదల చేశాడు. గతంలోని చిత్రాల వలె ఇది కూడా వివాదాస్పదం కావొచ్చని సినీ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ...

Read More »