Tag Archives: ycp

నేను ప్రభుత్వంలో నం.2 అనేది అబద్ధం: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేకుండా చేసిన పాపం చంద్రబాబుదేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. విజయవాడ హోటల్‌ ఐలాపురంలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో సజ్జల మాట్లాడారు. రాజధాని పేరుతో టీడీపీ అధినేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని తెలిపారు. తాను ఏపీ ప్రభుత్వంలో నం.2 అనేది అబద్ధమని సజ్జల చెప్పారు. జగన్‌ పెట్టిన పార్టీ.. ఆయన కష్టమ్మీద వచ్చిన పార్టీ అని తెలిపారు. జగన్‌ చేయగలిగినవన్నీచెప్పారని, చెప్పినవే గాకుండా దానికి మించి చేశారని అన్నారు. అవినీతిరహితంగా, పూర్తి పారదర్శకంగా, ...

Read More »

మరో విజయయాత్రకు సిద్ధమవుతున్న వైసీపీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ముగించిన వైసీపీ తాజాగా మరో విజయ యాత్ర చేయాలని భావిస్తోంది. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైసీపీ నేతలు చెప్పారు. రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ రోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కోసభ ఉంటుందని ...

Read More »

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గురువారం పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈక్రమంలో సీఎం జగన్ పులివెందులలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా కమలాపురం లో టీడీపీకి షాక్ తగిలింది. ఇవాళ పులివెందులలో సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, కమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డ వీర శివారెడ్డి తెలుగుదేశం ...

Read More »

మీ చేతిలో ఉన్న ఫోనే మీ ఆయుధం: వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా విభాగంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు మీ జగనన్న ఎప్పుడూ అండగా ఉంటాడు అని స్పష్టం చేశారు. అనంతరం, తన నుదుటిపై గాయాన్ని చూపిస్తూ, ఈ దెబ్బ ఇక్కడి తగిలింది అంటే… ఇక్కడా (కంటికి) తగల్లేదు, ఇక్కడా తగల్లేదు అంటే ఆ దేవుడు మనతో ఇంకా పెద్ద స్క్రిప్టునే రాయించే పనిలో ఉన్నాడు అని అర్థం ...

Read More »

బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు : సజ్జల రామకృష్ణారెడ్డి

వచ్చేనెల మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకరిపై మరొకరు రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కి ఏ కోశానా నాయకుడి లక్షణాలు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లు ఉంది అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ...

Read More »

ఓటమి భయంతో చంద్రబాబుకు ఫ్రస్టేషన్: వాసిరెడ్డి పద్మ

టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే హత్యా రాజకీయాలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సాక్షాత్తూ సీఎంపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. మంగళగిరి వైఎస్సార్‌సీపీ నేత వెంకటరెడ్డిని ఢీకొట్టి చంపేశారని, వైఎస్సార్‌సీపీ నాయకులు,సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు,లోకేష్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయి. కేసులుంటే పదవులని లోకేష్ చెబుతున్నాడు. ఓటమి అంచున ఉన్నారు కాబట్టే దాడులకు పాల్పడుతున్నారు. చంద్రబాబుకు అభివద్ధి.. పాలన చేయడం తెలుసా? ...

Read More »

టీడీపీకి ఈసీ నోటీసులు

సీఎం జగన్పై రాయి దాడి తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ జనరల్ సెక్రటరీకి సీఈవో నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జై టీడీపీ, తెలుగు దేశం పార్టీ అకౌంట్ల నుంచి జగన్పై అనుచిత పోస్టులు చేశారని సీఈవోకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.

Read More »

రాయి దాడి కేసు.. నిందితుడి వాంగ్మూలం కోసం పిటిషన్

సీఎం జగన్పై రాయి దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జడ్జి సమక్షంలో నిందితుడు సతీశ్ వాంగ్మూలాన్ని తీసుకునేందుకు అనుమతి కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా నిన్న సతీశు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.

Read More »

నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ అడుగుపెట్టనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి నుంచి అనకాపల్లి నియోజకవర్గం మీదుగా పెందుర్తి చేరుకోనున్నారు. సా.3.30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభ ఉండనుంది.

Read More »

నెల్లూరు జిల్లాలో జనసేనకు భారీ షాక్.. వైసీపీలో చేరిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేనకు భారీ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పారు. అంతేకాదు వైసీపీలో చేరారు. జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డితో పాటు నెల్లూరు మండల అధ్యక్షుడు కాటం రెడ్డి జగదీశ్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజెర్ల సుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో జిల్లాలో ...

Read More »