Tag Archives: ysrcp

పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్

మేమంతా సిద్ధం బస్సుయాత్రను బుధవారంతో ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా గురువారం పులివెందులలో పర్యటించారు. అనంతరం అక్కడ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తొలుత పులివెందులలోని సీఎస్ ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం అక్కడ్నుంచి నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జగన్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను పులివెందుల ఆర్. ఓ కు అందజేశారు. అంతకుముందు పులివెందులలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. తన ...

Read More »

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే: సీఎం జగన్

సీఎం జగన్ ఇవాళ టెక్కలి నియోజకవర్గం అక్కవరంలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సాయంత్రం వేళ అక్కవరంలో సిక్కోలు సింహాలు కనిపిస్తున్నాయని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు అని అభివర్ణించారు. ఈసారి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు గెలవాల్సిందే అని సమర శంఖం పూరించారు. డబుల్ సెంచరీ సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు. రేపటి ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి… ...

Read More »

టిప్పర్ డ్రైవ్ చేస్తూ వెళ్లి నామినేషన్ వేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అనంతపురంలో టిప్పర్ డ్రైవ్ చేస్తూ వెళ్లి నామినేషన్ వేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. టిప్పర్ డ్రైవ్ చేస్తూ వెళ్లి నామినేషన్ వేశారు శింగనమల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సమక్షంలో వీరాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో శింగనమల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు నామినేషన్‌ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు పార్టీ శ్రేణులు.

Read More »

మరోసారి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన పోతిన మహేశ్

ఇటీవలే జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన బెజవాడ నేత పోతిన వెంకట మహేశ్ మరోసారి పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ అన్ని విధాలుగా దిగజారిపోయారని విమర్శించారు. వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు… పార్టీలో దిగజారిపోయారు… పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టి పూర్తిగా దిగజారిపోయారు అంటూ పోతిన మహేశ్ వ్యాఖ్యానించారు. “పవన్ కల్యాణ్ ఈ మధ్య మూడు పెళ్లాల మాటెత్తితే గింజుకుంటున్నాడు. మరి, వాలంటీర్లను పట్టుకుని ‘మానవ అక్రమ రవాణాదారులు’ అంటే కోపం రాదా ...

Read More »

అగ్రవర్ణాలన్నీ జగన్ కే మద్దతు ఇస్తున్నాయి: జోగి రమేశ్

ఎన్నారైలు రాష్ట్రం కోసం స్వచ్ఛందంగా సేవ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని ఏపీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. కండకావరంతో టీడీపీకి సపోర్ట్ చేసే ఒక ఎన్నారై రాష్ట్ర ఓటర్లను వెధవలు అన్నాడని మండిపడ్డారు. ఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలని… మంచి చేస్తున్న జగన్ వైపే ఎన్నారైలు ఉండాలని చెప్పారు. ఎన్నారైలు చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని అన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి జగన్ సీఎంగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ శ్రేణులు యత్నిస్తున్నాయని… ...

Read More »

బొత్స తండ్రి లాంటివారన్న జగన్.. మంత్రి ఎమోషనల్

విజయనగరం జిల్లా చెల్లూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎమోషనల్ అయ్యారు. ‘బొత్స నా తండ్రి లాంటి వారు. ఆయన్ను చీపురుపల్లిలో గొప్ప మెజార్టీతో గెలిపించాలి’ అని CM జగన్ చెప్పగానే మంత్రి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ‘ఆప్యాయ పలకరింపుతో ఆనంద భాష్పాలు రాలిన వేళ’ అంటూ వైసీపీ Xలో పోస్టు చేసింది.

Read More »

జగన్ బస్సు యాత్ర ఒక చరిత్ర: ఎమ్మెల్సీ తలశిల రఘురాం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వైసీపీ శ్రేణులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. యాత్ర కొనసాగుతున్న రహదారులు జనాలతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాట్లాడుతూ… ఇప్పటి వరకు బస్సు యాత్ర 2100 కిలోమీటర్ల మేర కొనసాగిందని చెప్పారు. జగన్ పై హత్యాయత్నం జరిగినా వెనక్కి తగ్గలేదని అన్నారు. ప్రజల్లో జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో బస్సు యాత్ర ద్వారా అర్థమవుతోందని చెప్పారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రఘురాం విమర్శలు గుప్పించారు. ...

Read More »

పవన్ ను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలి: గ్రంధి శ్రీనివాస్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మానసిక స్థితి సరిగా లేదని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పవన్ కు నిలకడ లేదని చెప్పారు. తక్షణమే ఆయనను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. సినీ గ్లామర్ తో కార్లను మార్చినట్టు… భార్యలను పవన్ మారుస్తున్నారని విమర్శించారు. హిందూ వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించేలా పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలను ఇచ్చారని విమర్శించిన పవన్… ఇప్పుడు బీజేపీతో కలిసిపోయారని విమర్శించారు. కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించిన ...

Read More »

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం జగన్ కీలక హామీ

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ విశాఖకు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సీఎంను కలిశారు. కార్మికులతో మాట్లాడిన జగన్ వారికి కీలక హామీలు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మికులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి కృషి చేస్తున్నామని.. ప్రవేటీకరణకు వ్యతిరేకంగా నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని ...

Read More »

నేడు భీమిలిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్… దిశ నిర్దేశం చేయనున్న సీఎం వైయస్ జగన్

టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం చాలానే ఉంది.సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే చాలు అది నిజమే అని నమ్మేసే పరిస్థితులు ఉన్నాయి. వీటిని నడిపించే వాళ్ళను ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఈ పదం ఇప్పుడు ఓ సెన్షేషన్ గా మారింది. సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కిన ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లను మించి ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్న వాళ్లే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు. ఇన్ఫ్లుయెన్సర్స్ పార్టీలకు సంబంధించి ప్రచారం చేస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా ...

Read More »