ఈ సూత్రాలు…విజయానికి మార్గాలు..

అనుకున్న రంగంలో విజయాలు సాధించిన మహిళలు మన చుట్టూనే ఉంటారు. వాళ్లు ఆ స్థాయికి రావడానికి పాటించే నియమాలు కొన్ని లేకపోలేదు. అవేంటో మనమూ చూసేద్దాం.

‘విజయం ఎంత త్వరగా వస్తుందనేది.. మీ రోజును ఎంత ముందుగా ప్రారంభిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది’ అంటారు కొందరు మహిళలు. దానివల్ల మిగిలిన రోజంతా ఉత్సాహంగా సాగుతుందని నమ్ముతారు.

మహిళలు సాధారణంగా తమ వృత్తి, ఉద్యోగాల్లో మగవారితో రాజీ పడేందుకు అంతగా సిద్ధంగా ఉండరని సర్వేలు తెలియజేస్తున్నాయి. దీనికి కారణం మహిళలకు, పురుషులకు మధ్య ఉన్న వయోభేదం, వారి జీతాల్లో తేడాలుండటమే. అభివృద్ధి చెందిన దేశాల్లో 80 నుంచి 85 శాతం మంది పురుషులతో సమానంగా సంపాదిస్తున్నారు. ఈ భేదం వారి వయసుతో పాటు పెరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలను దృష్టిలో ఉంచుకోకండి.

మీ మార్గదర్శకుల నుంచి వాళ్ల ఉద్యోగానుభవాలు తెలుసుకోండి. మీ సందేహాలు ఎప్పటిప్పుడు నివృత్తి చేసుకోండి. అవన్నీ మీకు అప్పటికప్పుడు కాకపోయినా.. ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి.

మీకంటూ తాత్కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. తాత్కాలికమైనవి నెరవేర్చుకుంటూనే దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. అందుకు తగ్గట్లుగా సమగ్ర ప్రణాళిక తయారు చేసుకుని.. ఆ దిశగా వెళ్లేందుకు కృషిచేయాలి. ఎప్పటికప్పుడు ఫలితాలను బేేరీజు కూడా వేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*