చచ్చేటప్పుడు ఆయన పేరే జపిస్తా..!

థర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీ. ఈ పేరు చెబితేనే వెంటనే గుర్తుకు వచ్చేది నటుడు పృధ్వీ రాజ్. ఇప్పటికే 75 సినిమాల్లో నటించారు పృధ్వీరాజ్. గత కొన్నినెలల ముందు వరకు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన, పృధ్వీకి  దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అంటే మాత్రం బాగా ఇష్టం.

వైసిపిలో చేరుతారో లేదోనన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు గానీ, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం తనకు ప్రాణమంటున్నారు. నిద్రలో కూడా నేను ఎవరి పేరైనా జపిస్తున్నానంటే అది ఒక్క జగన్ పేరునే. నా ప్రాణం పోయేటప్పుడు కూడా ఆయన పేరునే నేను జపిస్తా.

జగన్ లాంటి నాయకుడు ప్రజలకు అవసరం. ప్రజా సేవలో జగన్ పడుతున్న ఆరాటం నాకు బాగా నచ్చింది. అందుకే పాదయాత్రలో వెళ్ళి జగన్‌ను కలిశానంటున్నారు పృద్వీ. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అన్నది జగన్ నిర్ణయిస్తారంటున్నారు పృధ్వీరాజ్.