ఈ బైక్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు!

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారి చిట్టా పెరిగిపోతోంది. రెండు నెలల క్రితం ఏపీ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి వాహనంపై ఏకంగా 40కి పైగా, తాజాగా ఓ ద్విచక్రవాహనం 135 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ రెండింటిని ఒకే ట్రాఫిక్‌ ఎస్‌ఐ గుర్తించడం విశేషం.

నారాయణగూడ ట్రాఫిక్‌ పీఎస్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న కృష్ణంరాజు గురువారం సాయంత్రం విధి నిర్వహణలో భాగంగా హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌లో సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఓల్డ్‌ అల్వాల్‌కు చెందిన కృష్ణప్రకాష్‌ హెల్మెట్‌ లేకుండా బైక్‌(టీఎస్‌10 ఇడి 9176)పై వెళుతుండగా పట్టుకున్నారు. చలానాల చిట్టా పరిశీలించగా వాహనంపై 135 ఉన్నాయి. జరిమానా మొత్తం రూ. 31,445. అతడిపై కేసు నమోదు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.