కేసీఆర్‌కు ‘సన్‌’ స్ట్రోక్‌..!

ఓటమి భయంతోనే కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెలుతున్నారని కాంగ్రేస్ సినియర్‌ నాయకుడు విహానుమంతరావు అన్నారు..ఖమ్మం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిది గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ కలహాలు, కొడుకు, మనవడి ఒత్తిడితో కేసీఆర్‌ సతమతమవుతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసిఆర్‌ తుంగలో తొక్కారన్నారు…ఇంటింటికి నీళ్లుఇచ్చి ఓట్లు అడుగుతానని చెప్పిన కేసిఆర్‌ ఒక్క ఇంటికి కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.. ఇన్ని మోసాలు చేశాడు కనుకే ప్రజలను తప్పించుకోవడానికి ముందస్తు ఎన్నికలను పెడుతున్నాడని విమర్శించారు..