వైసిపి మునుగుతున్న పడవట!

వైసిపి అధినేత జగన్ రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం జోక్ ఆఫ్ ది డికేడ్ గా మిగిలిపోనుందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ సిపి మునుగుతున్న పడవని…2019లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని మంత్రి గంటా జోస్యం చెప్పారు.

జగన్ ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు అఫిడివిట్లో 14 పేజీల‌ కేసుల గురించి పెట్టారని, దేశంలో ఏ నేతపై కూడా ఇన్నికేసులు ఉండవ‌ని గంటా దుయ్యబట్టారు.రాజకీయాల్లో నికార్సైన వ్యక్తి చంద్ర‌బాబేన‌ని, చంద్రబాబు గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంద‌ని మంత్రి గంటా విమర్శించారు. చంద్రబాబు అవినీతి చేసారంటూ అనేక విచారణలు జరిపించిన వైఎస్‌ ఇక్కటీ నిరూపించలేకపోయారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో అనేక ప్ర‌భుత్వ పథ‌కాలను అడ్డుకోవాలని వైసిపి ప్రయత్నించిందని మంత్రి గంటా విమర్శించారు. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన యువ నేస్తం పథకం కూడా అడ్డుకోవాలని యువతని వైసిపి రెచ్చ‌గొట్టిందని ఆరోపించారు. వైసిపి నేతలు కుట్రపూరితంగా రాజధానికి నిధులు రాకుండా వరల్డ్ బ్యాంక్ కి రైతుల పేరుతో తప్పుడు మెయిల్స్ పెట్టారన్నారు.

apteka mujchine for man ukonkemerovo woditely driver.