పాదయాత్రలో జగన్ ఆరోగ్య రహస్యం ఇదే..!

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 11 జిల్లాలు పూర్తి చేసుకొని 12వ జిల్లా విజయనగరం లోకి ప్రవేశించింది. విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జననేత సోమవారం విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గం చింతలపాలెంకు చేరుకోగానే వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ఇంతలా ప్రజల్లో మమేకం అవుతున్నా జగన్ ప్రతిరోజూ అంతేస్థాయిలో ఉత్సాహంగా ఉండటానికి కారణం ఏంటి? తాజాగా ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు బయటపెట్టాయి.

ఉదయం 4.30 గంటలకే మెలకువ..
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ రోజూ ఉదయం 4.30 గంటలకే నిద్రలేస్తారు. అనంతరం గంటపాటు వ్యాయామం చేస్తారు. కాలకృత్యాల అనంతరం ఉదయం 7 గంటల వరకూ న్యూస్ పేపర్లు చదువుతారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత ప్రజాసంకల్ప యాత్ర రూట్ మ్యాప్ ను అడిగి తెలుసుకుంటారు. కచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే యాత్ర కొనసాగేలా చూస్తారు.

ఓ గ్లాస్ జ్యూస్ తోనే యాత్ర ప్రారంభం..
ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా జగన్ ఎలాంటి అల్పాహారం తీసుకోరు. కేవలం ఉదయం పూట ఓ గ్లాస్ జ్యూస్ తాగి యాత్రను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కప్పు పెరుగుతో పాటు కొన్ని పండ్లు ఆహారంగా తీసుకుంటారు. ఇక రాత్రిపూట రెండు పుల్కాలు, పప్పు, మరో కూరను ఆహారంగా తీసుకుంటారు. నిద్రపోయేముందు కప్పు పాలు తాగుతారు.

గత 269 రోజులుగా వైఎస్ జగన్ దినచర్య ఇలానే కొనసాగుతోంది. రాత్రి నిద్రపోవడం ఎంత ఆలస్యమైనా ఉదయాన్నే కరెక్టుగా 4.30 గంటలకు జగన్ నిద్రలేస్తారు. రోజూ తెల్లటి చొక్కా, క్రీమ్‌ కలర్‌ ఫ్యాంట్, కాళ్లకు బూట్లు ధరించాక జగన్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ రోజు విజయనగరం జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్ర 3,000 కిలోమీటర్లకు చేరుకోనున్న సంగతి తెలిసిందే.

apteka mujchine for man ukonkemerovo woditely driver.