నా భార్యను కూడా అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు! : జగన్

ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా విజయనగరం మూడు లాంతర్ల జంక్షన్ లో పోటెత్తిన జన సందోహం కు కృతఙ్ఞతలు చెబుతూ వైస్ జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

విజయనగరం మూడు లాంతర్ల జంక్షన్ బహిరంగ సభలో ముఖ్యాంశాలు:

*విజయనగరంలో అభివృద్ధి రివర్స్ గేర్ లో నడుస్తుంది.

*ఈ నాలుగున్నర ఏళ్లలో ఏం జరిగింది?

*తోటపల్లి ప్రాజెక్ట్ లో కమిషన్ కోసం చంద్రబాబు కక్కుర్తి

*జంఝావతి ప్రాజెక్ట్ వైస్ హయాంలో అధిక ప్రాధాన్యం

*విజయనగరంలో మెడికల్ కాలేజ్ హామీ ఇచ్చారు మీకు ఎక్కడైనా కనిపించిందా?

*విజయనగరం స్మార్ సిటీ అన్నారు మీకు ఎక్కడైనా కనిపించిందా?

*విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ అన్నారు మీకు ఎక్కడైనా కనిపించిందా?

*విజయనగరంలో లలిత కళల అకాడమీ అన్నారు మీకు ఎక్కడైనా కనిపించిందా?

*విజయనగరంలో ఫుడ్ పార్క్ అన్నారు మీకు ఎక్కడైనా కనిపించిందా?

*విజయనగరంలో కొత్త ఉద్యోగాలు ఇప్పించటం దేవుడెరుగు 12000 మధ్య రోడ్డున పడ్డ పరిస్థితి

*విజయనగరంలో డిగ్రీ కాలేజ్ కూడా లేని పరిస్థితి

*సీఎం గా చంద్రబాబు ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయింది

*చంద్రబాబు సీఎం అయ్యాక నగరంలో ఉన్న రెండు జ్యూట్ మిల్లులు మూత పడ్డాయి

*జిల్లాలో నాలుగు జ్యూట్ మిల్లులు మూత పడ్డాయి

*భోగాపురం ఎయిర్ పోర్ట్ చుట్టూ చంద్రబాబు బినామీలకు భూములు

*ఎయిర్ పోర్ట్ పేరుతో బలవతంగా భూములు లాక్కున్నారు

*లంచాలు కోసం ఎయిర్ పోర్ట్ అధారిటీ అఫ్ ఇండియా టెండర్లు రద్దు చేసాడు

*నాలుగేళ్లు చిలక గోరికలు మాదిరి బీజేపీ టీడీపీ సంసారం చేసారు

*కేంద్రంలో మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు రాష్ట్రానికి రావాల్సినవి అడగానే అడగలేదు

*ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు అధర్మాలు ప్రచారం

*ఎన్టీఆర్ మరణానికి కారణం ఈ పెద్ద మనిషి చంద్రబాబు

*ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు అదే ఎన్టీఆర్ ఫోటో కు దండలు వేస్తాడు

*రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఈ పెద్ద మనిషి చంద్రబాబు

*ఇప్పుడేమో ధర్మ పోరాట దీక్ష పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు

*ఢిల్లీ వెళ్లి అరుణ్ జేట్లీకి సన్మానాలు చేసివచ్చింది నిజం కాదా?

*అసెంబ్లీ సాక్షిగా బీజేపీని పొగడ్తలతో ముంచెత్తింది ఈ పెద్దమనిషి చంద్రబాబు కాదా ?

*ఇన్ని చేసిన ఈ పెద్దమనిషి వైసీపీ బీజేపీతో అంటకాగుతుంది అని ప్రచారం చేస్తున్నాడు

*బాలకృష్ణ సినిమా సెట్ లో బీజేపీ వెంకయ్య నాయుడు కనిపించటం లేదా మీకు?

*ఈ పెద్దమనిషి రాజకీయాలు చూస్తుంటే బాధనిపిస్తుంది

*లోకేష్ చేయని అవినీతి లేదు

*అక్షరాల 4 లక్షల కోట్లు దోచేశారు

*భోగాపురం లో 1850 కోట్లు లూటీ చేసారు అని కాగ్ చెబుతుంటే .. మీ పై సిబిఐ దాడులు ఎందుకు జరగడం లేదు ?

*బీజేపీతో మీ దోస్తీ వల్లే కదా మీపై దాదులు జరగడం లేదు !

*ఓటుకు నోటు కేసులో మీకు నోటీసులు రావటం లేదు అంటే బీజేపీతో మీకున్న స్నేహం కారణం కాదా ?

*ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాను కనుకే నా భార్యను కూడా కేసులలో బీజేపీ వారు ఇరికిస్తున్నారు

*అయినా కూడా మడం తిప్పకుండా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే .. ఈ పెద్దమనిషి చంద్రబాబు వైసీపీ బీజేపీ కలిసిపోయాయి అని మాట్లాడుతున్నాడు

*విలువలు కలిగిన రాజకీయాలు మాత్రమే నేను చేస్తాను

*చంద్రబాబు మాదిరి అబద్దాల రాజకీయాలు చేయను

*టీడీపీ లాగా మోసాలు చేయటం నాకు రాదు