ధూళిపాళ్లను టార్గెట్ చేసిన జగన్!

జగన్ పాదయాత్ర పొన్నూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. పొన్నూరు నియోజకవర్గం అంటేనే ధూళిపాళ్ల కు మంచిపట్టున్న నియోజకవర్గం. ధూళిపాళ్ల కుటుంబానికే కాకుండా సైకిల్ పార్టీకి అండగా నిలుస్తున్న నియోజకవర్గం. జగన్ గుంటూరు జిల్లాలో ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు.పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ విజయాల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. గత ఐదు ఎన్నికల నుంచి ఇక్కడ పసుపు జెండానే ఎగురుతుండటం విశేషం.ఇక్కడ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర వరుస విజయాలతో దూసుకుపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గట్టి పోటీయే ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రావి వెంకట రమణకు 80625 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు 88,386 ఓట్లు వచ్చాయి. దాదాపు ఎనిమిది వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.

అయితే ఐదు సార్లు వరుస విజయాలతో దూసుకుపోతున్న దూళిపాళ్లకు జగన్ తన పాదయాత్రతో చెక్ పెట్టాలని చూస్తున్నారు. దాదాపు ఇరవై అయిదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండటంతో ధూళిపాళ్లపై సహజంగా వచ్చే వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రకు వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో విజయం సాధిస్తే గుంటూరు నియోజకవర్గంలోని అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో వైసీపీ ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*