కడపలో వీధి వీధి వాడ వాడల వైసీపీ అభిమానులే!

దాదాపు 14 నెలల తర్వాత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప కు వచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట దాదాపు 3640 ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై వారికష్టాలు తెలుసుకున్నారు.వైఎస్ జగన్ కడప రానున్న నేపధ్యంలో కడపలో వీధి వీధి వాడ వాడల పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు బ్యానర్ లు కట్టారు.దాదాపు 5 గంటలకు కడప నగరంలోని పెద్ద దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు చేసి పులివెందుల చేరుకుంటారు.జగన్ కడప వచ్చిన నేపధ్యంలో వైసీపీ అభిమానులు తండోపతండాలుగా జగన్ ను చూడటానికి ఎగబడితున్నారు.జగన్ కోసం జనం ఎదురుచూస్తున్న నేపధ్యంలో వైసీపీ కార్యకర్తలకు పండగ వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా జగన్ కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఘనంగా స్వాగతం లభించింది. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కావడం ఖాయం అని ఎమ్మెల్యే అంజాద్  బాషా అన్నారు.జగన్ పర్యటన ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది అని కొనియాడారు.చంద్రబాబు పాలన తో ప్రజలు విసిగిపోయారని,రాజన్న రాజ్యం జగన్ తో సాధ్యం అని ఎమ్మెల్ అంజాద్ బాషా అభిప్రాయపడ్డారు.