చింతమనేనిపై వైసీపీ ఆగ్రహం!

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైకాపా ఆద్వర్యంలో ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలను అరికట్టాలని, చి౦తమనేని ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేతబూని పెద్దఎత్తున నిరసన ఆ౦దోళన నిర్వహించారు.అశోక్ నగర్ లోని వైకాపా కార్యాలయం ను౦చి ఎస్పీ కార్యాలయం వరకూ పాదయాత్ర ప్రదర్శన చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ముట్టడించి దర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆళ్ళనాని, కోఠారు అబ్బాయి చౌదరి లు చి౦తమనేని ప్రభాకర్ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను దుయ్యబట్టారు.
పెదపాడు మ౦డల౦ నాయుడు గుడె౦లో వైకాపా జె౦డాను ఎగురవేసిన దళిత కార్యకర్త ఇ౦టిని దౌర్జన్యం గా తొలగించటం పై పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు.