Mana Aksharam
Entertainment Gossips

అడవుల్లో మహేష్

mahesh babu in forest for an ad shoot

సూపర్ స్టార్ మహేష్ దట్టమైన అడవుల్లో సంచరిస్తున్నారట.ఏ సినిమా కోసం అబ్బా అని అనుకుంటున్నారా..సినిమా షూట్ కోసం కాదు లెండి ఓ యాడ్ షూట్ కోసం. మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ దృష్ట్యా పెద్ద పెద్ద సంస్థలు తమకి ప్రచారకర్తగా మహేష్ ను ఎంచుకుంటున్నారు. దానికిగాను మహేష్ గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనుకోండి అది వేరే విషయం. తాను ప్రచార కర్త గా వ్యవహరిస్తున్న వాటిలో కోకోకోలా కంపనీ ఒకటి. తాజాగా దానికి సంబందించిన యాడ్ కోసం మహేష్ దక్షిణాఫ్రికాలోని దట్టమైన అడవుల్లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ అడవుల్లో – అరుదైన లొకేషన్లలో ఈ ప్రకనటనను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహర్షి సినిమా చేస్తున్నాడు. రెండు పాటల మినహా షూటింగ్ అంత పూర్తి చేసుకుంది. ఈ రెండు పాటలను అన్నపూర్ణ స్టూడియో లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరించబోతున్నారు. మే 09 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఎఫ్ 2 ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2020 సంక్రాంతి కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ప్లాన్ చేసారు చిత్ర యూనిట్.

Related posts

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై వర్మకు సహకరిస్తుంది ఎవరో తెలుసా?

ashok p

శ్రీదేవి పోస్టుమార్టం పూర్తి

ashok p

జూనియర్ హీరోపై వర్మ సంచలన వ్యాఖ్యలు?

ashok p