Mana Aksharam
  • Home
  • Entertainment
  • అదితి రావుతో నాని జతకట్టనున్నాడు
Entertainment

అదితి రావుతో నాని జతకట్టనున్నాడు

adithi to romance nani

నేచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ అనే సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌ లీడర్‌ సినిమాను ఎనౌన్స్‌ చేశాడు. ఈ రెండు సినిమాల రిలీజ్‌కు ముందే మరో సినిమాను కూడా ఫైనల్‌ చేశారు నాని. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మెహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా అదితి రావ్‌ హైదరిని హీరోయిన్‌గా తీసుకున్నారట. గత చిత్రం సమ్మెహనంలో హీరోయిన్‌గా నటించిన అదితిని ఈ సినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు ఇంద్రగంటి. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరో సుధీర్‌ బాబు కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

Related posts

నెట్లో హల్చల్ చేస్తున్న తమళ కపుల్.. ఎవరో తెలుసా..?

Manaaksharam

మహేశ్‌ తల్లిగా అలనాటి తార

ashok p

రోబో 2.0లో ఐష్ మెరవనుందా?

Harika