Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు : పవన్ కల్యాణ్
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాన్ నిన్న ఏలూరు సభలో మాట్లాడుతూ..అధికారంలోకి వస్తే..ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆయన మాట్లాడుతూ..సొంత బబాయ్ హత్యకు గురైతే..పట్టించకోవట్లేదు..ఇలాంటి నాయకులు ముఖ్యమంత్రులు అయితే ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే వీధి వీధికీ చిల్లర రౌడీలు తయరవుతారని..దుయ్యబట్టాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ..ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడుకి పాలనా యంత్రాంగం మీద పట్టుపోయిందని..అంతేకాకుండా..సొంత పార్టీ నాయకుల మీద పట్టు కోల్పోయారని..అన్నారు. చింతమనేని లాంటీ నాయకులు అడ్డంగా దోచేస్తుంటే..చూస్తూ ఊరుకుంటున్నారన్నారు పవన్. అయితే ఇవన్నీ పోవాలంటే జనసేన అధికారంలోకి రావాలన్నారు. జనసేన అధికారంలోకి వస్తే..ఆకు రౌడీల కాళ్లు విరిచి..పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని..వీటిలో 25 వేల ఉద్యోగాలు కేవలం ఒక పోలీస్ శాఖలోనే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే..55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు రూ. 5000 వేల పెన్షన్ ఇస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ కాలేజ్‌ను కార్పోరేట్‌కు దీటుగా తీర్చుదిద్దుతాం.. హెరిటేజ్ లాంటీ సంస్థల్ని ప్రోత్సహిస్తూ..ప్రభుత్వ కాలేజీలు, సహాకార సంఘాల్లో ఉన్న పరిశ్రమలని చంపేస్తున్నారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు.

Related posts

ఈ నష్టాన్ని తెలుగుదేశం భరించగలదా?

admin

చంద్రబాబు పాలనపై బీజేపీ సమరభేరి..

admin

ఆక్సిజన్ అందక చిన్నారులు మృతి

Masteradmin