Mana Aksharam
  • Home
  • Entertainment
  • అయ్యప్ప భక్తురాలిగా స్వీటీ
Entertainment Gossips

అయ్యప్ప భక్తురాలిగా స్వీటీ

anushka to donn a cameo in ayyapa swamy movie

టాలీవుడ్ బ్యూటీ అనుష్క కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. సంతోష్‌ శివన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట. అయ్యప్ప స్వామి చుట్టూ సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభం కానుందట. ఈ మేరకు ప్రశాంత్‌ అనే కొత్త రచయిత స్క్రిప్టు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో అనుష్క అయ్యప్ప భక్తురాలి అవతారమెత్తిన్నటు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎ.ఆర్‌. రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారట. అయితే ఈ వార్తలపై అనుష్క, సంతోష్‌ ఇంకా స్పందించలేదు.

‘భాగమతి’ తర్వాత అనుష్క ‘సైలెన్స్‌’ (పరిశీలనలో ఉంది) చిత్రంలో నటిస్తున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హారర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తీస్తున్న ఈ చిత్రంలో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Related posts

‘బిగ్‌బాస్‌ సీజన్‌-2’ వ్యాఖ్యాతగా నాని?

ashok p

మెగా హీరోలకు కళ్యాణ్ రామ్ ఛాలెంజ్..

ashok p

మహేష్ బాబు తర్వాతి చిత్రం సందీప్ తో ఉండనుందా?

Harika