Mana Aksharam
  • Home
  • News
  • Technology
  • ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్
News Technology

ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్

iphone xr price

ఆపిల్‌ ఫోన్‌ కొనాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్‌పై కంపెనీ భారీ రాయితీలు ప్రకటించింది. కంపెనీ తన ప్రతిష్టాత్మక ఐఫోన్‌ను ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మార్పులు చేసి ఐఫోన్ ఎక్స్ఆర్‌, ఎక్స్ఎస్‌, ఎక్స్ఎస్‌ మ్యాక్స్ అనే మూడు మోడళ్లను విడుదల చేయడంతో.. పాత మోడళ్ల ధరలను తగ్గించింది.

అన్ని వేరియంట్ల ధరపై రూ. 17,000 తగ్గించింది. ఈ పరిమితకాల డిస్కౌంట్‌ ఆఫర్‌ ఏప్రిల్‌ 5 నుంచి అందుబాటులోకి రానుంది

ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(64జీబీ)

ప్రస్తుతం ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(64జీబీ) ధర రూ. 76,900గా ఉంది. డిస్కౌంట్‌పై ఇది రూ. 59,900కే రానుంది.

128 జీబీ ఎక్స్‌ఆర్‌ ధర రూ. 81,900 నుంచి రూ. 64,900కు తగ్గనుంది.

ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(256జీబీ) ధర రూ. 91,900 నుంచి రూ. 74,900లకు దిగిరానుంది.

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేసిన వారికి మరో 10శాతం అదనపు రాయితీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఇది కేవలం పరిమితకాల ప్రమోషనల్‌ ఆఫర్‌ మాత్రమేనని, శాశ్వత ధర తగ్గింపు కాదని కంపెనీ స్పష్టం చేసింది.

Related posts

కాపులతో చంద్రబాబు మీటింగ్ సారాంశం ఏంటి?

admin

అమిత్ షా వచ్చి కూర్చోవాలి: కంచ ఐలయ్య

Masteradmin

దాడి వీరభద్రరావును ఆహ్వానించిన పవన్..!

admin